సినీ స్టార్ల మధ్య ‘సూపర్ స్టార్ ’సీఎం రేవంత్
x

సినీ స్టార్ల మధ్య ‘సూపర్ స్టార్ ’సీఎం రేవంత్

హైదరాబాద్‌లో చెరువులు, నాలాల కబ్జాలపై కొరడా ఝళిపిస్తూ ఆక్రమణలను హైడ్రా ద్వారా తొలగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి సినిమా స్టార్ల మద్ధతు పెరుగుతోంది.


పర్యావరణ పరిరక్షణకు సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న చర్యలతో ఆయనకు సినీస్టార్ల మధ్య సూపర్ స్టార్‌గా నిలిచారు.దశాబ్దాలుగా చెరువులు, నాలాల్లో వెలసిన అక్రమ నిర్మాణాలు, ఫాంహౌస్‌లు, కన్వెన్షన్ హాళ్లను హైడ్రా ద్వారా సీఎం రేవంత్ రెడ్డి కూల్చివేస్తుండటంతో ఆయనకు లేక్ మ్యాన్ ఆఫ్ తెలంగాణగా పేరొచ్చింది. పర్యావరణ పరిరక్షణే పరమావధిగా రాజకీయాలకు అతీతంగా బడా నేతల ఫాంహౌస్ లు, ఆక్రమణలపై హైడ్రా బుల్డోజర్లను పంపిస్తుండటంతో సామాన్య ప్రజల నుంచే కాకుండా సినిమా స్టార్ల నుంచి సీఎం రేవంత్ కు మద్ధతు పెరుగుతోంది.

- ప్రముఖ సినీహీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటరు తుమ్మిడి చెరువు ప్రాంతంలో నిర్మించారని తేల్చిన హైడ్రా అధికారులు దాన్ని బుల్డోజర్లతో నేటమట్టం చేశారు. సినీ హీరో ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో కొంతకాలం చలనచిత్ర పరిశ్రమ ప్రముఖలు మౌనంగా ఉన్నారు. కానీ ఈ ఎన్ కన్వెన్షన్ ను తుమ్మిడి చెరువు ఎఫ్ టీ ఎల్ పరిధిలో నిర్మించారని శాటిలైట్ చిత్రాలతో హైడ్రా అధికారులు వెల్లడించడంతో సీఎం రేవంత్, హైడ్రా కూల్చివేత చర్యలను అభినందిస్తూ మద్ధతుగా నిలిచారు. మౌనాన్ని వీడిన పలువురు టాలీవుడ్ ప్రముఖులు సీఎం పర్యావరణ చర్యలకు మద్దతు పలికారు.

రేవంత్ కు టాలీవుడ్ లో పెరుగుతున్నమద్దతు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ (హైడ్రా) ఏజెన్సీకి టాలీవుడ్ ప్రముఖులు మద్దతు తెలిపారు. ప్రముఖ సినీ దర్శకుడు హరీష్ శంకర్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు, జనసేన నాయకుడు, సినీనటుడు నాగబాబు, సినీనటి మధుశాలిని సీఎం రేవంత్ కు మద్ధతుగా తన ఎక్స్ ఖాతాల్లో పోస్టులు పెట్టారు.సీఎం రేవంత్ ను, హైడ్రాను అభినందిస్తూ ముగ్గురు సినీ స్టార్లు పెట్టిన ఎక్స్ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.



రేవంత్ సర్కారుకు సినీడైరెక్టర్ హరీష్ శంకర్ శాల్యూట్

చెరువుల్లోని ఆక్రమణలను బుల్డోజర్లతో కూల్చివేయిస్తున్న సీఎం రేవంత్ కు సినీ దర్శకుడు హరీష్ శంకర్ శాల్యూట్ చేశారు. సీఎంను, హైడ్రాను ఆయన సమర్ధించారు.‘‘ ప్రకృతిని గౌరవిద్దాం. విచ్ఛిన్నమైన వ్యవస్థపై నకిలీ మేకప్‌లు వేయకుండా, గొప్ప భవిష్యత్తుకు పునాదులు వేయడానికి ప్రయత్నిస్తున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి నేను సెల్యూట్ చేస్తున్నాను.’’ అని హరీష్ శంకర్ పేర్కొన్నారు.హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలనే తపనతో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న పనులకు అండగా నిలవాలని తెలంగాణ ప్రజలను ఆయన కోరారు.

సీఎం రేవంత్ విజన్ కు మధుశాలిని మద్ధతు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సినీనటి మధుశాలిని మద్దతు తెలిపారు. ‘‘తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, మీ విజన్, నాయకత్వానికి ధన్యవాదాలు. హైడ్రా అనేది మన సహజ పర్యావరణ అవసరాలకు అనుగుణంగా ఉండే ఫార్వర్డ్-థింకింగ్ విధానాన్ని సూచిస్తుంది. మరింత సామరస్యపూర్వకమైన భవిష్యత్తు వైపు మమ్మల్ని నడిపించే మీ ప్రయత్నాలను నేను అభినందిస్తున్నాను’’ అని మధుశాలిని ఎక్స్ పోస్ట్‌లో పేర్కొంది.

సీఎం రేవంత్ కు నాగబాబు అభినందన

చెరువుల కబ్జాలను హైడ్రా ద్వారా కూల్చివేస్తున్నందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అభినందించారు. ‘‘వర్షాలు పడి తూములు తెగిపోయి,చెరువులు నాళాలు ఉప్పొంగి పోయి అపార్ట్ మెంట్లలోకి కూడ నీళ్లు రావడం,కొందరు సామాన్యులు బలికావడం చాల బాధాకరం, వీటికి ముఖ్య కారణం చెరువుల్ని నాలాలని అక్రమంగా కబ్జా చేసి నిర్మాణాలు చేయడమే,ఇప్పటికైన అర్ధమైందా తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేబట్టిన హైడ్రా కాన్సెప్ట్ అభినందనలు’’ అని నాగబాబు ఎక్స్ లో వ్యాఖ్యానించారు.
వర్షాలు పడి తూములు తెగిపోయి,చెరువులు నాళాలు ఉప్పొంగి పోయి అపార్ట్మెంట్ లకి కూడ నీళ్లు రావడం,కొన్ని సామన్య ప్రాణాలు కూడ బలికావడం చాల బాధకారం వీటికి ముఖ్య కారణం చెరువుల్ని నాళాలని అక్రమ కబ్జా చేసి నిర్మాణాలు చేయడమే ..


Read More
Next Story