కొడగంల్ అభివృద్ధికి సీఎం శకుస్థాపన
x

కొడగంల్ అభివృద్ధికి సీఎం శకుస్థాపన

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి.


తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం కొడంగల్‌లో పర్యటించారు. రూ.103 కోట్లతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు శంకుస్థాపన స్థాపన చేశారు. అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మిడ్ డే మీల్స్ కిచెన్ భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సీఎం రేవంత్ శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులు ఇవే..

  • రూ. 5.83 కోట్లతో నియోజకవర్గంలో 28 అంగన్‌వాడీ భవనాల నిర్మాణం
  • రూ. 5.01 కోట్లతో నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 23 అదనపు తరగతి గదుల నిర్మాణం
  • రూ. 3 కోట్లతో నియోజకవర్గంలో 10 GP భవనాల నిర్మాణం
  • రూ. 3.65 కోట్లతో బంజారా భవన్ కోసం అదనపు సౌకర్యాలు (కాంపౌండ్ వాల్, డైనింగ్ హాల్, నీటి సరఫరా మరియు విద్యుదీకరణ)
  • రూ. 1 కోటితో కొడంగల్‌లో ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్‌కు శంకుస్థాపన
  • రూ. 1.30 కోట్లతో అగ్నిమాపక కేంద్రం నిర్మాణం.
  • రూ. 1.40 కోట్లతో కొడంగల్‌లో స్విమ్మింగ్ పూల్ నిర్మాణం
  • రూ. 4.91 కోట్లతో కమ్యూనిటీ హాళ్లు, కిచెన్ షెడ్లు & కాంపౌండ్ వాల్స్ నిర్మాణం
  • రూ. 4.45 కోట్లతో సిసి రోడ్లు & భూగర్భ డ్రైనేజీలు (యుజిడిలు) నిర్మాణం
  • రూ. 2.95 కోట్లతో నిర్మించిన అదనపు తరగతి గదులు, అంగన్‌వాడీ కేంద్రాలు & గ్రంథాలయ భవనాల ప్రారంభం
  • రూ.60 కోట్లతో కొడంగల్ పట్టణంలో రోడ్డు విస్తరణ
  • రూ. 5 కోట్లతో గెస్ట్ హౌస్ నిర్మాణం
  • రూ. 4.50 కోట్లతో కోస్గి వ్యవసాయ మార్కెట్‌లో కొత్త అభివృద్ధి పనులు
Read More
Next Story