సర్టిఫికెట్ల కోసం బాధపడొద్దు... ఖమ్మంలో సీఎం కీలక హామీలు
x

సర్టిఫికెట్ల కోసం బాధపడొద్దు... ఖమ్మంలో సీఎం కీలక హామీలు

కుండపోత వర్షాలతో ఖమ్మం జిల్లా జలసంద్రంగా మారింది. మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలు ముంపులో చిక్కుకున్నాయి.


కుండపోత వర్షాలతో ఖమ్మం జిల్లా జలసంద్రంగా మారింది. మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలు ముంపులో చిక్కుకున్నాయి. రాజీవ్ గృహకల్ప కాలనీలోకి మున్నేరు వరదనీరు భారీగా చేరుకోవడంతో ఆ ప్రాంతమంతా సముద్రాన్ని తలపించింది. ఈరోజు వర్షపాతం తక్కువగా ఉండటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, నేడు సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలోని వరద ప్రాంతాలలో ప్రాంతాలలో పర్యటించారు.

రాజీవ్ గృహకల్ప లో ఇళ్లు నీట మునగడంతో తీవ్రంగా నష్టపోయిన బాధితులకు రూ.10,000 చొప్పున తక్షణ సాయం అందించాలని సీఎం కలెక్టర్ ను ఆదేశించారు. ప్రతి కుటుంబానికి నిత్యవసర సరుకులు అందించాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి సోమవారం రోడ్డు మార్గంలో వర్షం కారణంగా తీవ్రంగా నష్టపోయిన సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో పర్యటించారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు ఉత్తంకుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎంపీ రఘురాం రెడ్డి తదితరులు ఉన్నారు.

వరద విషాదాన్ని తెచ్చిపెట్టింది...

ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... "చాలా బాధాకరమైన సందర్భం ఇది. వరద మీ బతుకుల్లో విషాదాన్ని తెచ్చిపెట్టింది. మంత్రులు అధికారులు నిరంతరం మీకోసం కష్టపడుతున్నారు మంత్రి పొంగులేటి నిద్ర లేకుండా సమీక్షిస్తున్నారు. పెద్దలతో మాట్లాడుతుంటే 60 70 ఏళ్లలో ఇంత భారీ వర్షాన్ని చూడలేదని చెబుతున్నారు భారీ వర్షాలు వల్ల రాజీవ్ గృహకల్ప లో నివసిస్తున్న వందల కుటుంబాలు నష్టపోయాయి ఆ ఇళ్లలోకి వెళ్లి చూస్తే సర్వం నీళ్లలో మునిగిపోయి ఉన్నాయి కష్టపడి సంపాదించి కొనుక్కున్న పప్పు ఉప్పు మొదలుకొని అన్ని వస్తువులు నీడ మొలగడంతో తీవ్రంగా నష్టపోయారు వరద నీటిలో తమ పిల్లల సర్టిఫికెట్లు నానిపోయాయంటూ కొందరు ఆవేదన చెందుతున్నారు" అని తెలిపారు.

ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటాం...

భారీ వర్షాలకు ప్రభావితమైన ప్రతి కుటుంబానికి నిత్యవసర సరుకులను అందించాలని కలెక్టర్ ను ఆదేశించాము ఇల్లు నీట మునిగిన వారు నీ తక్షణమే గుర్తించి పదివేలు వెంటనే అందించాలని ఆదేశిస్తున్నాం. ఎవరికైనా ప్రాణా నష్టం జరిగితే ఐదు లక్షలు పశుసంపద నష్టం వాటిలితే 50,000 గొర్రెలు మేకలు చనిపోతే 5000 చొప్పున ఇవ్వాలని ఆదేశించాం. ఇల్లు దెబ్బ తింటే ఆ ఇళ్లకు పీఎం ఆవాస్ యోజన కింద నష్టాన్ని అంచనా వేసి దానికి ఆర్థిక సాయం అందిస్తాం. వరదల వల్ల సర్టిఫికెట్లు పోయినవారికి కొత్తవి ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. మీ కుటుంబాలకు అందుబాటులో ఉండి మీ కష్టాల నుంచి గట్టెక్కించే బాధ్యత మాది ఎమ్మెల్యేలు మంత్రులు మీ నష్టాన్ని అంచనా వేస్తున్నారు ధైర్యంగా ఉండండి రెవెన్యూ సిబ్బంది ఇంటింటికి తిరిగి ఎంత నష్టపోయారు అంచనా వేస్తారు. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది" అని సీఎం హామీ ఇచ్చారు.

Read More
Next Story