
తెలంగాణ ఉద్యమ కవులకు కోటి రూపాయాల పురస్కారం..
ఈ బహుమతిని సీఎం రేవంత్ రెడ్డి అందించారు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ వేడుకలకు ప్రత్యేక అతిథిగా జపాన్‌లోని కితక్యూషూ సిటీ మేయర్ టకేచీ హాజరయ్యారు. రాష్ట్ర అవతరన దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన తొమ్మిది మందికి కోటి రూపాయాల నగదు పురస్కారం అందించాలని నిర్ణయించింది. ఈ బహుమతిని సీఎం రేవంత్ రెడ్డి అందించారు. ఉద్యమం సమయంలో తమ సాహిత్యం, కళతో ప్రజల్లో ఉద్యమ జ్వాలలను రగిల్చిన కవులు, కళాకారులు, సాహితీవేత్తలు తొమ్మిది మందిని ఎంపిక చేసి వారికి నగదు పురస్కారం అందిస్తామని తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సమయంలో రేవంత్ వెల్లడించారు. అదే విధంగా ఈరోజు తొమ్మిది మందికి నగదు పురస్కారం అందించారు.
పురస్కారం అందుకున్న వారి వివరాలిలా
ఎక్కా యాదగిరి రావు, అందెశ్రీ, సుద్దాల అశోక్ తేజ, జయరాజు, పాశం యాదగిరి కి పురస్కారాన్న సీఎం అందించారు. దివంగత గూడ అంజయ్య, గద్దర్, బండి యాదగిరి నగదు పురస్కారాన్ని అందుకున్న వారి కుటుంబ సభ్యులు. విదేశీ పర్యటనలో ఉన్న గోరటి వెంకన్న తరపున ఆయన కూతురు పురస్కారాన్ని అందుకున్నారు.