Telanga Rising Global Summit: రేవంత్ ఫుల్ బిజీ
x

Telanga Rising Global Summit: రేవంత్ ఫుల్ బిజీ

భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్.


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. అన్ని రంగాల్లో పెట్టబుడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ సదస్సు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. వరుసు సమావేశాలతో ఫుల్ బిజీ అయ్యారు.

రాష్ట్రంలో పెట్టుబడులను పెట్టడానికి దేశ, విదేశాలకు చెందిన సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. దీంతో ఆయా సంస్థల ప్రతినిధులతో సీఎం రేవంత్ భేటీ అవుతున్నారు. వరుస ఎంఓయూలను కుదుర్చుకుంటున్నారు.

సదస్సు తొలి రోజే దాదాపు రూ.2.43 లక్షల కోట్ల పెట్టుబడులను తెలంగాణ ఆకర్షించింది. రెండో రోజూ కూడా అదే వేగాన్ని కొనసాగిస్తోంది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి రూ.1,11,395 కోట్ల పెట్టుబడులను సంబంధించి ఎంఓయూలను తెలంగాణ కుదుర్చుకుంది.

భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సంస్థ తెలంగాణలో రూ.1000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి రెడీ అయింది.

ఈ మేరకు కాంట్రాక్ట్ రీసెర్చ్, డెవలప్‌మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆర్గైనేషన్ నిర్మాణానికి ఈ పెట్టుబడి పెట్టనుంది. తద్వారా వచ్చే నాలుగేళ్లలో 200 మందికి పైగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.

ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. అంతేకాకుండా మరెన్నో సంస్థలు కూడా ఎంఓయూలను కుదుర్చుకున్నాయి.

Read More
Next Story