CM Revanth Reddy
x

ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో

మెట్రో విస్తరణను ఫ్యూచర్ సిటీ వరకు తీసుకెళ్లాలని నిర్ణయించారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకు అవసరమైన తుది ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.


ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ప్రపంచంతో పోటీ పడేలా ఈ సిటీ నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఆ దిశగా ప్రయత్నాలను కూడా ముమ్మరం చేశారు. తాజాగా మెట్రో విస్తరణను ఈ ఫ్యూచర్ సిటీ వరకు తీసుకెళ్లాలని నిర్ణయించారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకు అవసరమైన తుది ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మెట్రో విస్తరణపై అధికారులతో సీఎం రేవంత్ సమీక్షించారు.

76.4 కిమీ మేర మెట్రో రెండో దశ విస్తరణకు రూ.24,269 కోట్లతో డీపీఆర్ కేంద్రానికి సమర్పించినట్లు చెప్పారు. నాగోల్–శంషాబాద్, రాయదుర్గం–కోకాపేట్, ఎంజీబీఎస్–చాంద్రాయణగుట్ట రూట్లు తదితర అంశాలపై చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. మెట్రో విస్తరణకు కేంద్ర అనుమతుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేయాలని సీఎం సూచించారు. ఎయిర్‌పోర్ట్–ఫ్యూచర్ సిటీ (యంగ్ ఇండియా యూనివర్శిటీ వరకు) 40 కిమీ కొత్త మెట్రో లైన్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఫ్యూచర్ సిటీ 30,000 ఎకరాల్లో అభివృద్ధి కానుండటంతో మెట్రోను మీర్ ఖాన్పేట వరకు పొడిగించాలని తెలిపారు. డీపీఆర్‌ను తయారుచేసి కేంద్రానికి పంపించాలని అధికారులకు ఆదేశించారు. హెచ్ఎండీఏ, ఎఫ్ఎస్డీఏలను మెట్రో విస్తరణలో భాగస్వాములుగా చేయాలని చెప్పారు.

Read More
Next Story