Caste Census | ‘కుల గణనతో ఇచ్చిన మాట నెరవేర్చుకున్నాం’
x

Caste Census | ‘కుల గణనతో ఇచ్చిన మాట నెరవేర్చుకున్నాం’

దేశంలో బలహీనవర్గాలకు సంబంధించి ఇప్పటి వరకు సహేతుకమైన సమాచారం లేదన్నారు రేవంత్ రెడ్డి.


తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కులగణన నివేదికకు రాష్ట్ర మంత్రివర్గం మంగళవారం జరిగిన సమావేశంలో ఆమోద ముద్ర వేసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ హాల్లో దాదాపు రెండు గంటలపాటు కేబినెట్ సమావేశం కొనసాగింది. ఈ నేపథ్ంయలోనే కుల గణన సర్మేను సీఎం రేవంత్ రెడ్డి.. అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో బలహీనవర్గాలకు సంబంధించి ఇప్పటి వరకు సహేతుకమైన సమాచారం లేదన్నారు. స్వాతంత్ర్యం రావడానికి ముందు 1931ల్లో ఒకసారి దేశంలో కులగణన నిర్వహించారిన, ఆ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు కులగణన చేపట్టలేదని చెప్పారు. ఆ ఫీట్‌ను మళ్ళీ ఇప్పుడు తమ ప్రభుత్వ సాధించింది. దేశంలో కులగణన చేపట్టిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని అన్నారు.

‘‘దేశంలో బలహీనవర్గాలకు సంబంధించి ఇప్పటి వరకు సహేతుకమైన సమాచారం లేదు. దీంతో రిజర్వేషన్లు అమలు చేసే క్రమంలో ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితి ఉంది. 1931 తరువాత భారతదేశంలో ఇప్పటి వరకు బలహీన వర్గాల సంఖ్య ఎంతో తేల్చలేదు. జనాభా లెక్కల్లోనూ బలహీనవర్గాల లెక్కలు పొందుపరచలేదు. అందుకే భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ రాష్ట్రంలో కులగణన చేస్తామని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేశాం. కులగణన ప్రక్రియను పూర్తి చేసి ఇవాళ నివేదికను సభలో ప్రవేశపెట్టాం. ప్రతీ గ్రామంలో, తండాల్లో ఎన్యూమరేటర్లు పకడ్బందీగా వివరాలు సేకరించారు. ప్రతీ 150 ఇండ్లను ఒక యూనిట్ గా గుర్తించి ఎన్యూమరేటర్లను కేటాయించి వివరాలు సేకరించాం. 76 వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు 36 రోజులు కష్టపడి ఈ నివేదికను రూపొందించారు. రూ.160 కోట్లు ఖర్చుచేసి ఒక నిర్దిష్టమైన పకడ్బందీ నివేదిక రూపొందించాం. పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తరువాత సభలో ప్రవేశపెట్టాం. 56 శాతం ఉన్న బీసీలకు సముచిత గౌరవం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. దేశానికి ఆదర్శంగా నిలిచేలా నివేదికను రూపొందించడానికి కృషి చేసిన అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా’’ అని వెళ్లడించారు.

‘‘రాష్ట్రంలో కుల గణన సర్వే తప్పనిసరిగా చేయాలని 2024 పిబ్రవరిలో నిర్ణయించుకున్నాం. కర్ణాటక, బీహార్ సహా వివిధ రాష్ట్రాల్లో క్షుణ్ణంగా అధ్యయనం చేశాం. సర్వే నిర్వహించే విధానాలపై వివిధ సంఘాలు, మేధావుల అభిప్రాయాలు తీసుకున్నాం. 50 రోజుల పాటు సర్వే జరిగింది. గ్రామాల్లో 66.39 లక్షల కుటుంబాలు, పట్టణాల్లో 45.15 లక్షల కుటుంబాల్లో సర్వే నిర్వహించాం. రాష్ట్రంలో మొత్తంగా 1.12 కోట్ల కుటుంబాల వివరాలు సర్వే చేశాం. సర్వే ప్రకారం రాష్ట్రంలో ఎస్‌సీలు 17.43శాతం.. 61,84,319 మంది, బీసీలు(ముస్లిం మైనారిటీ మినహా) 1,64,09,179 మంది అంటే 46.25, ఎస్టీలు 37,05,929 మంది అంటే 10.45శాతం, ముస్లిం మైనారిటీలు 44,57,012 అంటే 12.56 శాతం ఉన్నారు. ఈ నివేదికను సంక్షేమ విధానాల తయారీకి వినియోగిస్తాం’’ అని తెలిపారు.

‘‘కుల గణన సర్వేను అత్యంత పకడ్బందీగా చేశాం. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికీ స్టిక్కర్ అంటించాం. ఒక ఎన్యుమరేటర్ రోజుకు 10 ఇళ్ల కంటే ఎక్కువ ఇళ్లలో సర్వే చేయలేదు. 8పేజీలతో ఉన్న ప్రశ్నపత్రంలో సమగ్ర వివరాలు నమోదు చేశాం. 76 వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు 36 రోజుల పాటు పనిచేసి డేటా క్రోడీకరించారు. మొత్తంగా రూ.125కోట్లు ఖర్చు చేసి సర్వే ద్వారా సమగ్ర వివరాలు సేకరించాం. మేం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సర్వే చేయించాం’’ అని చెప్పారు.

Read More
Next Story