‘ఫ్యూచర్‌సిటీ’ భవనానికి శంకుస్థాపన
x

‘ఫ్యూచర్‌సిటీ’ భవనానికి శంకుస్థాపన

రూ.20కోట్ల వ్యవయంతో నాలుగు నెలల్లో నిర్మాణం.


సీఎం రేవంత్ రెడ్డి డ్రీప్ ప్రాజెక్ట్ ‘ఫ్యూచర్‌సిటీ’ భవనానికి ఈరోజు శంకుస్థాపన జరిగింది. పలువురు మంత్రులతో కలిసి రేవంత్ రెడ్డి.. శంకుస్థాపన చేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్ పేటలో ఫ్యూచర్‌సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయాన్ని 15వేల చదరపు అడుగుల్లో నిర్మిస్తున్నారు. ఈ భవనాన్ని రూ.20వేల కోట్ల వ్యవయంతో నాలుగు నెలల్లో నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. దీని పరిధిలో 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 56 రెవెన్యూ గ్రామాలు, మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. హైదరాబాద్‌పై జనాభా ఒత్తిడిని తగ్గించడం, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం వంటి లక్ష్యాలతో ప్రభుత్వం ఫ్యూచర్‌సిటీని నిర్మిస్తోంది. ప్రపంచబ్యాంకు, జపాన్‌ అంతర్జాతీయ సహకార సంస్థ(జైకా)లు అభివృద్ధిలో భాగస్వాములవుతున్నాయి. మరోవైపు రావిర్యాల-ఆమనగల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ రేడియల్‌ రోడ్‌-1కు సీఎం రేవంత్‌రెడ్డి భూమిపూజ చేశారు. ఈ భవన నిర్మాణం తర్వాత ఫ్యూచర్‌సిటీలో జరిగే అభివృద్ధి పనులు, లేఅవుట్లు, పరిశ్రమలకు ఎఫ్‌సీడీఏ అధికారులు అనుమతులిస్తారు.

రాజకీయం అనవసరం: రేవంత్

ఫ్యూచర్‌ సిటీ నిర్మాణంపై వస్తున్న విమర్శలకు సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. రియల్ ఎస్టేట్ కోసమే ఈ ప్రాజెక్ట్‌ అని కొందరు అనవసరంగా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. “నాకు భూములున్నాయని దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ ఇది భవిష్యత్‌ తరాల కోసమే చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమం” అని స్పష్టం చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి పునాదులు వేసిన చంద్రబాబు, వైఎస్సార్‌ను గుర్తుచేసిన సీఎం, “వాళ్లు ఆలోచించినందుకే హైటెక్‌ సిటీ, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు, ORR వచ్చాయి. అలాగే భవిష్యత్‌ కోసం మేము ఫ్యూచర్‌ సిటీకి శ్రీకారం చుట్టాం” అన్నారు. “ఇంకెన్నాళ్లు విదేశాల గురించి మాట్లాడుకుంటాం? పదేళ్ల సమయం ఇవ్వండి.. న్యూయార్క్‌ను మరిపించే నగరం కడతా” అని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.

గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు ఇందుకే..

ఇతర ప్రాంతాల నుంచి ఫ్యూచర్‌సిటీకి ప్రయాణాన్ని మరింత సులభతరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే ‘రతన్ టాటా రోడ్డు’ పేరిట గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్‌ను నిర్మిస్తోంది. ఈ రోడ్డుకు సీఎం రేవంత్.. భూమిపూజ చేశారు. ఈ రోడ్డు 300 అడుగుల వెడల్పుతో 41.5 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. దీనిని రెండు దశల్లో నిర్మించనున్నారు. ఈ రోడ్.. ఔటరింగ్ రోడ్ సమీపంలోని రావిర్యాల నుంచి రీజనల్ రింగ్ రోడ్డులోని ఆమనగల్లు వరకు ఉంటుంది. మొదటి దశలో బాగంగా రావిర్యాల(టాటా ఇంటర్‌ఛేంజ్) నుంచి మీర్‌ఖాన్ పేట వరకు 19.20 కిలోమీటర్ల రోడ్డును నిర్మించనున్నారు. ఈ మొదటి దశ రోడ్డుకు రూ.1665 కోట్లు కేటాయించారు.

రెండో దశలో భాగంగా మీర్‌ఖాన్ పేట నుంచి ఆమనగల్లు వరకు 22.30 కిలోమీటర్ల పొడవు రోడ్డును నిర్మిస్తారు. ఈ రెండో దశ రోడ్ నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.2,365 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ రోడ్డు నిర్మాణం జరిగితే ఫ్యూచర్‌సిటీకి హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, నాగార్జున సాగర్, విజయవాడ రహదారుల నుంచి నేరుగా చేరుకోవచ్చు.

Read More
Next Story