Revanth Reddy | బోనస్ పడుతుంటే బీఆర్ఎస్ నేతల గుండెలు అదురుతున్నాయా?
x

Revanth Reddy | బోనస్ పడుతుంటే బీఆర్ఎస్ నేతల గుండెలు అదురుతున్నాయా?

తెలంగాణ అభివృద్ధికి తొలిరోజు నుంచి బీఆర్ఎస్ నేతలే అడ్డుపడుతున్నారంటూ రైతు పండగా వేడుకలో సీఎం రేవంత్ విమర్వలు చేశారు.


తెలంగాణ రైతుల ఖాతాల్లో బోనస్‌ డబ్బులు పడుతుంటే బీఆర్ఎస్(BRS) నేతల గెండుల అదురుతున్నాయంటూ రైతు పండగ(Rythu Panduga)లో సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రైతుల కోసం తమ ప్రభుత్వం రూ.54 వేల కోట్లు ఖర్చు పెట్టిందని వెల్లడించారు. ఈ సందర్బంగా పాలమూరు వేదికగా రైతు పండగకు అన్ని ఏర్పాట్లు సజావుగా చేసిన అధికారులకు అభినందనలు తెలిపారు. గతేడాదితో నవంబర్ 30వ తేదీకి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు లభించిందని అన్నారు. గతేడాది ఇదే రోజున రాష్ట్రంలో మార్పు కోసం ప్రజలు ఓటు వేశారని, దొరల గడీలను కూల్చడం కోసం కాంగ్రెస్‌ను ఎంచుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు. పాలమూరు బిడ్డగా తాను రైతుల కష్టాలు ఎన్నో చూశానని, వలసలు పోతున్న బస్సులను చూసి ఎన్నోసార్లు మనసు తరుక్కుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. బూర్గుల రామకృష్ణారావు తర్వాత సరిగ్గా 70 ఏళ్ల తర్వాత పాలమూరు బిడ్డ కొండారెడ్డిపల్లి నుంచి బయలుదేరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదా అందుకున్నారని అన్నారు. ఈ ప్రభుత్వం పాలనలో అనవసర ఖర్చులకు స్థానం లేదని స్పష్టం చేశారు. భట్టి విక్రమార్క సహా పార్టీలోని సీనియర్ నేతలు పాలమూరు బిడ్డకు అవకాశం ఇవ్వాలని తనకు అవకాశం కల్పించారని చెప్పారు.

వరి వేసుకుంటే ఉరే అన్న వ్యక్తి కేసీఆర్

‘‘ఈ రాష్ట్రాన్ని కేసీఆర్, ఆయన కుటుంబం కలిసి ఏం చేసిందో మాకంటే ఎక్కువగా మీకే బాగా తెలుసు. ఆనాడు వరి వేస్తే ఉరి వేసుకున్నట్లే అన్న వ్యక్తి కేసీఆర్. కానీ మా ప్రభుత్వం వరి వేసిన ప్రతి ఒక్కరికీ రూ.500 బోనస్ ఇస్తున్నాం. ఆ పైసలు రైతులు ఖాతాల్లో పడుతుంటే బీఆర్ఎస్ నేతల గుండెలు అదురుతున్నాయి. రైతులు సంతోషంగా ఉంటే బీఆర్ఎస్ నేతలకు నిద్ర పట్టడం లేదు. స్వరాజ్య భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో రుణమాఫీ ఏనాడూ జరగలేదు. రుణమాఫీపై చర్చకు మోదీ, కేసీఆర్ సిద్ధమా? ఏడాదిలోనే 25 లక్షల రైతుల కుటుంబాలకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేసిన రాష్ట్రం ఏదైనా ఉందా? రైతు రుణమాఫీ చేసిన చరిత్ర ఈ ప్రభుత్వానిదే. కాళేవ్వరం కట్టినా అన్నడు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు చేపట్టినామన్నాడు. కేవలం సాగునీటి ప్రాజెక్ట్‌ల కోసం రూ.1.80 లక్షల కోట్లు ఖర్చు పెట్టాామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసమే లక్షా రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని డబ్బా కొట్టుకున్నారు’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అన్ని కోట్లు ఖర్చు చేసిన ఒక్క ప్రాజెక్ట్ కూడా నిలవలేదని, అన్నీ కూలిపోయాయంటూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన మంజీర, కోయిలసాగర్, శ్రీరాంసాగర్, ఎల్లంపల్లిలాంటి ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు ఇచ్చి ఈ సంవత్సరం 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వరి పండిచామని ప్రకటించారు. స్వాతంత్ర్యం తర్వాత ఇంతటి స్థాయిలో వరిని ఎవరూ పండించిన దాఖలాలు లేవని వెల్లడించారు.

అభివృద్ధికి అడ్డుపడుతుంది వారే..

‘‘పాలమూరు అభివృద్ధి బీఆర్ఎస్‌కు జీర్ణం కావట్లేదు. ప్రాజెక్ట్‌లు కట్టాలన్నా, కంపెనీలు తీసుకురావాలన్నా అడ్డుపడుతున్నాారు. లగచర్లలో చిచ్చు పెట్టింది వాళ్లే. బీఆర్ఎస్ నేతల మాటలు నమ్మొద్దని లగచర్లకు సూచించాం. నమ్మితే నష్టపోయేది మనమే. కుట్రలను కుతంత్రాలను తిప్పికొట్టాలి. అధికారుల మీద దాడులు చేయాల్సి వస్తే శ్రీశైలం, సాగర్ లాంటి ప్రాజెక్ట్‌లు కట్టగలిగేవాళ్లమా? ప్రతిపక్షాల ఉచ్చులో పడొద్దు. కుటుంబాలను నావనం చేసుకోవద్దు. కేసీఆర్, కేటీఆర్ పరిశ్రమలు అడ్డుకుని ఫాంహౌస్‌కు పోతారు. రైతులు పడే కష్టాలు వారికి తెలియదా? కొడంగల్‌లో పారిశ్రామిక పార్క్‌లు నిర్మించి ఉద్యోగాలు తీసుకురావాలని అనుకున్నా. కానీ లగచర్లలో గొడవ చేసి మంట పెట్టారు. బీఆర్ఎస్ మాయమాటలు నమ్మి గిరిజనులు జైళ్లకు వెళ్లే పరిస్థితి వచ్చింది. కేసీఆర్ హయాంలో మన జిల్లాలకు ఇంతమంది మంత్రులు ఎప్పుడైనా వచ్చారా? అసలు ఒక్కసారైన సరిగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారా?’’ అని ప్రశ్నించారు.

మహబూబ్‌నగర్‌కు ఏటా రూ.20 వేల కోట్లు

రైతు పండగ కార్యక్రమం సందర్బంగా ప్రతి ఏడాది మహబూబ్‌నగర్ జిల్లాకు రూ.20వేల కోట్లు ఇవ్వాలని మంత్రివర్గాన్ని కోరారు. జిల్లాలోని రైతుల వలసల జీవితాలు బాగుపడాలంటే ఏడాదికి రూ.20వేల కోట్లు అవసరమని, 70ఏళ్లు జిల్లా వాసులకు అన్యాయమే జరిగిందని చెప్పుకొచ్చారు.

Read More
Next Story