10 ఫలితాలు వచ్చేశాయ్..
x

10 ఫలితాలు వచ్చేశాయ్..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న వెంటనే నేరుగా ఆయన రవీంద్ర భారతికి చేరుకుని పదివ తరగతి పరీక్షలను విడుదల చేశారు.


10వ తరగతి విద్యార్థులు ఆత్రుతగా, ఆశగా ఎదురుచూస్తున్న ఫలితాలు వచ్చేశాయి. రవీంద్రభారతి‌లో సీఎం రేవంత్ రెడ్డి.. ఈ ఫలితాలను విడుదల చేశారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న వెంటనే నేరుగా ఆయన రవీంద్ర భారతికి చేరుకుని పదివ తరగతి పరీక్షలను విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను https://bse.telangana.gov.in , https://results.bse.telangana.gov.in , https://www.manabadi.co.in వెబ్‌సైట్లలో చూసుకోవచ్చు.

గ్రేడింగ్ స్థానంలో మార్కులు

ఈసారి గ్రేడింగ్ స్థానంలో మార్కుల మెమోలపై సబ్జెక్ల వారీగా మార్కులు, గ్రేట్లను ఇవ్వనున్నారు. ఈమేరకు కొత్త మెమో నమూనాను కూడా విద్యాశాఖ విడుదల చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో మార్కుల విధానాన్ని తొలగించి గ్రేడింగ్ విధానాన్ని అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే. 2009 నుంచి ఈ విధానం అమలులోకి వచ్చింది. ఏ-1, ఏ-2, బీ-1,బీ-2, సీ-1, సీ-2, డి, ఈలుగా గ్రేడ్‌లను ఇచ్చేవారు. సబ్జెక్ట్‌ల వారీగా గ్రేడ్లతో పాటు సీజీపీఏ ఇచ్చేవారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఈ విధానాన్ని తొలగించి సీజీపీఏ కాకుండా సబ్జెక్టులవారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. అయితే విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు, విద్యార్థులతో చర్చించకుండానే సరికొత్త విధానాన్ని అమలు చేయడం పట్ల అనేక ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

Read More
Next Story