జలదృశ్యం వద్ద  బాపూజీ జయంతి పోస్టర్ ఆవిష్కరణ
x

జలదృశ్యం వద్ద బాపూజీ జయంతి పోస్టర్ ఆవిష్కరణ

ముఖ్యమంత్రి జలదృశ్యం వద్ద బాపూజీకి నివాళులు అర్పించాలి


సామాజిక తెలంగాణ స్వాప్నికుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 11వ జయంతి పోస్టర్ ను బిసి రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్ నేతృత్వంలో గ్రేటర్ హైదరాబాద్ కమిటీ సభ్యులు ఘనంగా ఆవిష్కరించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి బీసీ,ఎస్సీ, ఎస్టీలకు 69% రిజర్వేషన్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్పిస్తున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని , ఇది ముమ్మాటికి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆలోచనలను ప్రతిబింబిస్తుందని తెలిపారు.
శనివారం ఉదయము ఎనిమిది గంటల నుండే అనేకమంది ప్రముఖులు జలదృశ్యానికి చేరుకోనున్నారని అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసామని దాసు సురేశ్ తెలిపారు.

కాంగ్రెస్ నేతలు ఎస్ జైపాల్ రెడ్డి, కొనిజేటి రోశయ్య వంటి ప్రముఖుల విగ్రహ ఆవిష్కరణ చేసిన, ముఖ్యమంత్రి. వారు అత్యంత అభిమానించే ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి జయంతి సందర్భంగా నివాళులర్పించి, స్థానిక సంస్థల్లో అట్టడుగు వర్గాలకు కేటాయించిన 69% రిజర్వేషన్లను బాపూజీ జయంతి సందర్భంగా జాతికి అంకితం చేయాలని కోరారు.
బాపూజీ అభిమానులను, అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులను, తెలంగాణ అమరవీరుల కుటుంబాలను, మేధావులను,కళాకారులను, మహిళ,విద్యార్థి నాయకులను 27న జలదృశ్యం వద్ద బాపూజీ జయంతి వేడుకలకు మీడియా ముఖంగా బీసీ రాజ్యాధికార సమితి కమిటీ సభ్యులు ఆత్మీయంగా ఆహ్వానించారు..
ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలు పద్మావతి, మారేపల్లి లక్ష్మణ్, మంద వెంకటస్వామి, సిరిగంధం నాగరాజు, సురేష్, మదన్ యాదవ్ మాధవి, సాయి, జ్యోతి,లక్ష్మి, శారద తదితరులు పాల్గొన్నారు.


Read More
Next Story