మహరాష్ట్రలో రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనా..!
x

మహరాష్ట్రలో రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనా..!

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అందుకోసమే ఇటీవల ముంబై వెళ్లి ప్రచారంలో కూడా పాల్గొన్నారు.


మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అందుకోసమే ఇటీవల ముంబై వెళ్లి ప్రచారంలో కూడా పాల్గొన్నారు. ఆ సందర్భంగా తెలంగాణలో అన్ని హామీల అమలుకు చర్యలు తీసుకుంటున్నామని, రైతులకు రుణమాఫీ చేస్తునస్నామంటూ చేసిన ప్రచారంపై తాజాగా తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ముఖ్యనేత హరీష్ రావు మండిపడ్డారు. ఇన్ని అబద్ధాలు ఎలా నేర్చావు రేవంత్ అంటూ చురకలంటించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలవుతున్నాయా అని ప్రశ్నించారు. ప్రధానంగా ఇచ్చిన ఆరు హామీలకే గతి లేదు కదా అంటూ విమర్శించారు. తెలంగాణలో చేస్తున్న మోసాలు చాలవన్నట్లు కాంగ్రెస్ వీటిని మహారాష్ట్రకు కూడా మోసుకుపోతోందని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో పూర్తి చేస్తామన్న హామీలు ఎక్కడ అమలవుతున్నాయో సీఎం రేవంత్ చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. మహిళలకు రూ.2,500 ఇస్తామని చెప్పి మోసం చేశరని, ప్రభుత్వం వచ్చి 11 నెలలు గడుస్తున్నా ఒక్క నెల కూడా మహిళలకు హామీ ప్రకారం నగదు చెల్లించలేదని గుర్తు చేశారు. ఇక్కడ చేసేది నిల్ మహారాష్ట్రలో చెప్పేది ఫుల్ అంటు సెటైర్లు వేశారు హరీష్ రావు. మహారాష్ట్రలో కూడా తెలంగణలో ఏమీ చేయలేదని, తెలంగాణ అంధకారంలోకి పంపే ప్రయత్నంలో ఉన్నామని చెప్పాలంటూ దుయ్యబట్టారు.

ఏం నెరవేర్చారు సీఎం సార్..

‘‘అధికారంలోకి వచ్చిన వారంలోనే రైతు రుణమాఫీ చేస్తామన్నారు. చేశారా? ఇచ్చిన ఆరు గ్యారెంట్లను కాంగ్రెస్ పూర్తిగా అమలు చేయలేదు. రుణమాఫీ కేవలం 20 లక్షల మంది రైతులకే జరిగింది. మిగిలిన 22 లక్షల మంది రైతుల పరిస్థితి ఏంటి. రుణమాఫీ ఆలస్యంగా చేయడం వల్ల ఈ సమయంలో రైతులు వడ్డీలు కట్టాల్సి వస్తోంది. ఇక్కడ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కానీ మహారాష్ట్రకు వెళ్లి అబద్ధాలు వల్లిస్తున్నారు. రైతు భరోసా లేదు. రైతు కూలీలకు రూ.12వేల ఇవ్వలేదు. వరి పంటకు రూ.500 బోనస్ ఇస్తున్నట్లు మహారాష్ట్ర ప్రచారం చేస్తున్నారు.. రైతుల్లో ఒక్కరికైనా బొనస్ వచ్చిందా? 11 నెలల్లో ఒక్క ఇల్లు కట్టలేదు. కానీ కూల్చడంలో మాత్రం ముందుటున్నారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలిస్తామన్నారు. ఇచ్చారా? మీరు ఇచ్చామని చెప్పుకుంటున్న 50వేల ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ ఇచ్చింది ఎవరు? ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. మహారాష్ట్రలో చెప్పండి తెలంగాణలో మాట తప్పామని’’ అని హరీష్ రావు విమర్శలు గుప్పించారు.

మహారాష్ట్రలో రేవంత్ ఏమన్నారంటే..

‘‘తెలంగాణలో అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే హామీల అమలు ప్రక్రియ మొదలైంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. తెలంగాణలో రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం 25 రోజుల్లో 22,22,067 మంది రైతులకు రూ.17,869 కోట్లు మాఫీ చేసాం. ఎవరికైనా వివరాలు కావాలంటే ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఏ ఒక్కరికీ అన్యాయం జరగనివ్వం. ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే 50వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. మహాలక్ష్మీ పథకం ద్వారా రూ.500లకే గ్యాస్ అందిస్తున్నాం. ఇప్పటివరకు దాదాపు 50 లక్షల మంది 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ద్వారా లబ్ది పొందుతున్నారు. వరికి రూ.500 మద్దతు ధర అందిస్తున్నాం. 1కోటి 4 లక్షల మంది మహిళలు ఈ పది నెలల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వినియోగించుకున్నారు. ఇందుకోసం రూ.3541 కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం అందించింది’’ అని రేవంత్ తెలిపారు.

Read More
Next Story