‘కూలిన ప్రాజెక్ట్‌కు, నిలబడిన ప్రాజెక్ట్‌కు తేడా లేదా’
x

‘కూలిన ప్రాజెక్ట్‌కు, నిలబడిన ప్రాజెక్ట్‌కు తేడా లేదా’

నిపుణులు పక్కా ప్రణాళికలతో కట్టిన ప్రాజెక్ట్ కాబట్టే దశాబ్దాలుగా నిలబడిందని చెప్పుకొచ్చారు.


భారీ వర్షాలు రాష్ట్ర ప్రజల జీవనవిధానాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ క్రమంలో జిల్లాల్లోని పరిస్థితులను పరిశీలించడం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేపట్టారు. ఇందులో భాగంగా ఆయన పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ దగ్గర పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మేడిగడ్డ ప్రాజెక్ట్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కూలిన ప్రాజెక్ట్‌కు నిలబడిన ప్రాజెక్ట్‌కు చాలా తేడా ఉందని అన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ రాష్ట్రానికి ప్రాణవాయువు వంటిదని సీఎం పేర్కొన్నారు. ఇది స్ట్రాటజిక్ లొకేషన్‌తో కట్టిన ప్రాజెక్ట్‌ అని, నిపుణులు పక్కా ప్రణాళికలతో కట్టిన ప్రాజెక్ట్ కాబట్టే దశాబ్దాలుగా నిలబడిందని చెప్పుకొచ్చారు. మేడిగడ్డ పనికిరాకుండా పోయింది. మేడిగడ్డ రిపేరు చేయకుండా.. అన్నారం, సుందిళ్లలో నీరు నిల్వ చేయొచ్చు కదా? అని ప్రశ్నకు సీఎం సమాధానమిచ్చారు. ‘‘అతి తెలివితేటలతో మామ, అల్లుడు .. ఒకరు స్వాతి ముత్యం, మరొకరు ఆణిముత్యం అనుకుంటారు. మేడారం, అన్నారం, సుందిళ్ల.. మూడు బ్యారేజీలు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో నిర్మించారు. మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తి అన్నారంలో పోయాలి, అక్కడి నుంచి సుందిళ్ల, శ్రీపాద ఎల్లంపల్లిలో పోయాలి. 3 బ్యారేజీల డిజైన్‌లో, నిర్మాణంలో, నిర్వహణలో లోపం ఉంది. ఏదైనా ప్రమాదం జరిగేతే గ్రామాలకు గ్రామాలు తుడిచిపెట్టుకుపోతాయి. మేం.. 80వేల పుస్తకాలు చదవలేదు. 80 వేల పుస్తకాలు చదివిన మేధావిని సలహా అడుగుతున్నాం ఏం చేద్దామని. మేడిగడ్డ విషయంలో సాంకేతిక కమిటీ సూచనల ప్రకారం వెళ్తాం. కాళేశ్వరం కమిషన్‌ నివేదికపై అసెంబ్లీలో చర్చించి ముందుకెళ్తాం’’ అని సీఎం స్పష్టం చేశారు.

Read More
Next Story