ఇంటింటి సర్వేలో గల్ఫ్ వలసల వివరాల సేకరణ
x

ఇంటింటి సర్వేలో గల్ఫ్ వలసల వివరాల సేకరణ

తెలంగాణలో సాగుతున్న ఇంటింటి సర్వేలో గల్ఫ్ వలసల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తోంది. ఈ సర్వేతో ఎంత మందిగల్ఫ్ దేశాలకు వలస వెళ్లారనేది వెల్లడికానుంది.


తెలంగాణలో చేపట్టిన కుల గణన ఇంటింటి సర్వేలో వలసల వివరాలను కూడా సర్కారు సేకరిస్తోంది. తెలంగాణలో సుమారు 15 లక్షల మంది ప్రవాసీ కార్మికులు గల్ఫ్ తదితర దేశాల్లో పనిచేస్తున్నట్లు అనధికార అంచనా. ఈ సర్వేతో గల్ఫ్ దేశాల్లో ఎంత మంది తెలంగాణ వాసులున్నారనేది ఖచ్చితమైన సంఖ్య వెల్లడికానుంది. బుధవారం తెలంగాణ రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక,


వలస పోయినా రేషన్ కార్డులో పేరు తొలగించం...
తెలంగాణలో ఉపాధి, రాజకీయ, కులగణన ప్రారంభం అయింది.సర్వేలో విదేశాలకు వలస వెళ్లారని చెబితే రేషన్ కార్డుల్లో పేర్లు తీసేస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సర్కారు అలాంటిదేమి లేదని ప్రకటించింది. ఉపాధి కోసం విదేశాలకు వలస వెళితే రైతు బంధు,రైతు బీమా వర్తించదా? ఇతర సంక్షేమ పథకాలు వర్తించవా? అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. ‘‘తెలంగాణ ప్రభుత్వం ఒక సామాజిక ఆశయంతో సర్వే నిర్వహిస్తోంది. ఆ సర్వే ముందుకు సాగకుండా కొంతమంది దుష్ప్రచారానికి తెరలేపారు. ఒక్క విషయం వెరీ క్లియర్... ఈ సర్వేతో రేషన్ కార్డులు తొలగించడాలు,ప్రభుత్వ పథకాల నుంచి తొలగించడాలు ఉండవు’’ అని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

వలస వివరాలపై సర్వే ప్రశ్న
ఇంటింటి కుటుంబ సర్వే ప్రశ్న నెంబరు 48 లో వలస వివరాలు అడిగారు. మీ కుటుంబం నుంచి ఎవరైనా వలస వెళ్ళారా? ఇతర దేశాలు అయితే దేశం పేరు, ఇతర రాష్ట్రాలు అయితే రాష్ట్రం పేరు, వలస వెళ్లడానికి కారణం అనే ప్రశ్నలున్నాయి.

వెల్లడి కాని సమగ్ర కుటుంబ సర్వే వివరాలు
టీఆర్ఎస్ ప్రభుత్వం 2014 ఆగస్టు 19వతేదీన నిర్వహించిన 'సమగ్ర కుటుంబ సర్వే' లో విభాగం-సి, కాలం నెం.17 లో వలస కూలీలు, ప్రవాసీల ప్రస్తావన ఉంది. 9 వ కోడ్ ను ఎంపిక చేస్తే 'విదేశాలలో పనిచేస్తున్నారు' అని నమోదయ్యేలా ప్రశ్నావళిని రూపొందించారు. ఈ విధంగా సేకరించిన గల్ఫ్ కార్మికుల సమాచారాన్ని కేసీఆర్ ప్రభుత్వం బయటపెట్టలేదు. సమాచార హక్కు చట్టం కింద అడిగినా ఇవ్వలేదు.

తెలంగాణ అల్ ఇండియా మిలీ కౌన్సిల్ వినతి
కుల గణనలో ముస్లింలు తమ వివరాలు చెప్పాలని తెలంగాణ అల్ ఇండియా మిలీ కౌన్సిల్ ప్రజలను కోరింది. ఇంటింటి కుల గణనలో అర్హులైన ముస్లింలు బీసీ-ఈ పేరిట నమోదు చేసుకోవాలని ఆల్ ఇండియా మిలీ కౌన్సిల్ తెలంగాణ ప్రధాన కార్యదర్శి ముఫ్తీ ఖమర్ అబిదిన్ ఖాస్మీ మదానీ కోరారు.

అర్హులైన ముస్లింలు సర్వేలో పాల్గొనండి : మైనారిటీ కమిషన్
తెలంగాణలో బీసీ ఈ రిజర్వేషన్లకు అర్హులైన ముస్లింలు ఇంటింటి సర్వేలో పాల్గొనాలని తెలంగాణ మైనారిటీ కమిషన్ ఛైర్మన్ తారిఖ్ అన్సారీ కోరారు. ముస్లిం షేక్, ముస్లిం ఖురేషీ, ముస్లిం ఫకీర్ లేదా ఏదైనా ఇతర సంబంధిత ఉప-కులాలకు చెందిన ప్రజలు సర్వేలో పాల్గొని సామాజిక-ఆర్థిక హక్కుల గుర్తింపు పొందాలని తారిఖ్ సూచించారు. వివిధ ప్రభుత్వ పథకాలు,సంక్షేమ విధానాలను పొందేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందన్నారు.


Read More
Next Story