ఎవెరీ డే ఇండియా, ఫోటో ఎగ్జిబిషన్ నేడు మూడో రోజు...
x

ఎవెరీ డే ఇండియా, ఫోటో ఎగ్జిబిషన్ నేడు మూడో రోజు...

స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రారంభమైన ఈ ప్రదర్శన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవమైన - ఆగస్టు 19 వరకు ఉంటుంది. ప్రతిరోజు 11 గంటల నుంచి ఏడు గంటల వరకు సందర్శించవచ్చు.


భారతీయ సామాన్యుడి కెలిడో స్కోప్ ఈ ఫోటో ఎగ్జిబిషన్. సామాన్యడిని అతగాడి సహజ పరిసరాలలో వివిధ కోణాలనుంచి చూపిస్తూ ఫోటో గ్రాఫర్ కందుకూరి రమేష్ బాబు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఇది. సామాన్యడి ప్రపంచం ఎంత అబ్బురపరిచేదిగో ఉంటుందో చాలా మంది గమనించి ఉండరు. ఈ అదృశ్య కోణాలను రమేష్ అద్బుతంగా చాలా చాయాచిత్రాలతో చూపించారు.




ఈ ఎగ్జిబిషన్ నిన్న ప్రారంభమయింది. వివరాలు:


సామాన్యుల జీవితానికి అద్దం పట్టేలా ఏర్పాటు చేసిన ఈ ఫోటో ఎగ్జిబిషన్ సందర్శకులను ఆకట్టుకుంది. సామాన్యుల నిత్య జీవితాన్ని అందరికీ తెలిసే ఉద్దేశంతో 60 ఫొటోలను ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు.

హైదరాబాద్​లోని స్టేట్‌ ఆర్ట్ గ్యాలరీలో ఎవ్రీ డే ఇండియా పేరిట ఛాయాచిత్ర ప్రదర్శనను శుక్రవారం ప్రొఫెసర్​ హరగోపాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, తదితరులు పాల్గొన్నారు.

దేశమంటే మతం రాజకీయమే కాదని, మట్టి, మనుషులు కూడా అని చెప్పడానికి ఎవ్రీ డే ఇండియా పేరుతో ఫొటోగ్రఫీ షో ప్రారంభించామని ప్రముఖ జర్నలిస్టు ఫొటోగ్రాఫర్ కందుకూరి రమేష్ బాబు అన్నారు. సామాన్యుల నిత్య జీవితాన్ని అందరికీ తెలిసే ఉద్దేశంతో 60 ఫొటోలను హైదరాబాద్ స్టేట్‌ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శనకు ఉంచామని ఆయన తెలిపారు.

ఆగస్టు నెల 19న ప్రపంచ ఫొటోగ్రఫీ డే సందర్భంగా ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు రమేష్ బాబు చెప్పారు. ఈ ప్రదర్శన ఆగస్టు 19 వరకు కొనసాగుతుందని తెలిపారు.

ప్రస్తుతం కథలు, నవలలు రాసేవారు ఉన్నారని, కానీ ఫొటోగ్రఫీ ద్వారా కథ రాసేది మాత్రం చాలా అరుదని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. సామాన్యుల జీవితాలు తెలిపే ప్రదర్శన అని, ఫోటోలు భావాల్ని సజీవంగా ఉంచుతాయని, వాటి నుంచే భాష అభివృద్ధి చెందిందని ఆయన పేర్కొన్నారు.

'మనుషుల అనుభవాలు ముఖాల్లో కనిపిస్తున్నాయి. వాళ్ల భావోద్వేగాలు కూడా ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది చూడగానే చెప్పదల్చుకున్న వివరణ, విషయం అవసరం లేకుండా అర్థమవుతోంది. ఫోటోలు చాలా బాగుంది'- ప్రొఫెసర్‌ కోదండరాం, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు

మనుషుల అనుభవాలు ముఖాల్లో కనిపించేలా తీసిన చిత్రాలు ఎన్నో భావాలను చెబుతున్నాయని కోదండరాం అన్నారు. ఒక్కో ఫొటో ఒక కథ చెబుతోందని, ఒక్క నిమిషం వీడియో కన్నా ఒక చిత్రం ఎన్నో విషయాలు చెబుతోందని ఆయన చెప్పారు. శ్రామిక జీవన సౌందర్యాన్ని అద్దం పట్టే ఎన్నో అపురూప చిత్రాలు ఇక్కడ కొలువు తీరాయని కోదండరాం వివరించారు.

ప్రముఖులను కాకుండా సామాన్యుల జీవితాలను నేను సెలబ్రిటీ​గా చేస్తూ ఉంటానన్నారు ఫోటోగ్రాఫర్ రమేష్ బాబు. నేను ఇండియా అనకుండా ఎవ్రీడే ఇండియా అనే ఉద్దేశం ఏంటంటే నిత్య జీవితం, నిత్య భారతం, సాధారణ భారతం అని తెలిపారు.

సామాన్య జీవితాన్ని ఎత్తిచూపడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. ప్రపంచ ఫొటోగ్రఫీ డే సందర్భంగా ఈ ఫోటో ప్రదర్శనను ఏర్పాటు చేశానని రమేష్ బాబు చెప్పుకొచ్చారు.

Read More
Next Story