ఎన్ కన్వెన్షన్ సెంటర్ పై ఫిర్యాదు..నాగార్జునకు షాక్
x
Akkineni Nagarjuna

ఎన్ కన్వెన్షన్ సెంటర్ పై ఫిర్యాదు..నాగార్జునకు షాక్

తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను వెంటనే కూల్చేయాలని హైడ్రాకు ఫిర్యాదు అందింది.


ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జునకు షాక్ తగలబోతోంది. హైటెక్ సిటీకి దగ్గరలోని తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను వెంటనే కూల్చేయాలని హైడ్రాకు ఫిర్యాదు అందింది. జనంకోసం అనే స్వచ్చంధ సంస్ధ నిర్వాహకుడు భాస్కరరెడ్డి ఈ ఫిర్యాదును ఇచ్చారు. చెరువును ఆక్రమించి 3.30 ఎకరాల్లో సినీనటుడు అక్కినేని నాగార్జున కన్వెన్షన్ సెంటర్ను నిర్మించినట్లు భాస్కర్ ఫిర్యాదు అందించారు. నాగార్జున చెరువును ఆక్రమించి అక్రమంగా కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించిన విషయం గతంలోనే నిరూపితమైనట్లు కూడా రెడ్డి ఫిర్యాదులో చెప్పారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలోనే కన్వెన్ష సెంటర్ పై చాలా ఆరోపణలు వచ్చిన విషయాన్ని భాస్కర్ గుర్తుచేశారు. అప్పట్లోనే సర్వేచేసిన అధికారులు చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ హాలును నిర్మించినట్లుగా గుర్తించిన అధికారులు అదే విషయాన్ని సెంటర్ కు నోటీసులు కూడా ఇచ్చినట్లు చెప్పారు. అయితే తర్వాత ఏమైందో ఏమో ఎవరూ సెంటర్ వైపు వెళ్ళలేదని భాస్కర్ ఆరోపించారు. ఇప్పటికైనా హైడ్రా జోక్యం చేసుకుని సెంటర్ ను కూల్చేసి చెరువుకు పూర్వవైభవాన్ని తీసుకురావాలని భాస్కర్ తన ఫిర్యాదులో చెప్పారు. మరి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు నేపధ్యంలో హైడ్రా ఎన్ కన్వెన్షన్ సెంటర్ విషయంలో ఏమిచేస్తుందనే విషయం ఆసక్తిగా మారింది.

Read More
Next Story