‘జూబ్లి’ కి కాంగ్రెస్, బిఆర్ఎస్  చేసింది శూన్యం : కిషన్ రెడ్డి
x
Kishan reddy roadshow in jubilee Hills

‘జూబ్లి’ కి కాంగ్రెస్, బిఆర్ఎస్ చేసింది శూన్యం : కిషన్ రెడ్డి

బిజెపికి పట్టం కట్టడానికి ప్రజలు సిద్దం


జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు చేసింది శూన్యమని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గురువారం నియోజకవర్గంలో రోడ్డుషో నిర్వహించారు. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ రెండేళ్లలో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. గ్యారెంటీలు అడిగితే ఫ్రీ బస్ అంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ఇచ్చే సన్నబియ్యంలో మెజారిటీ వాటా కేంద్రానిదేనని కిషన్ రెడ్డి అన్నారు. దీనికి సంబంధించిన పోస్టు కార్డును ఆయన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టారు. ‘ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి ఇజ్జత్ అంటావు. మరి హిందువులు ఇజ్జత్ కాదా మిస్టర్ రేవంత్ రెడ్డి’ అని కిషన్ రెడ్డి నిలదీశారు. ఎర్రగడ్డలో ఖబరస్థాన్ కోసం స్థలం ఇచ్చేందుకు మనసొచ్చింది కాని బంజారాహిల్స్ పెద్దమ్మ తల్లి గుడికి 50 గజాలు ఇవ్వడానికి ఎందుకు మనసొప్పలేదని ఆయన ప్రశ్నించారు. హిందువుల మీద దాడులు జరుగుతున్నా పట్టించుకోవు. ఎన్నాళ్లు మజ్లిస్ ను భుజాన వేసుకుని తిరుగుతావో తిరుగు ప్రజలే తగిన రీతిలో గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు.


పదేళ్లు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ జూబ్లిహిల్స్ ను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. అభివృద్దికి జూబ్లిహిల్స్ ఆమడదూరంలో ఉందని ఆయన విమర్శించారు. సానుభూతి వోట్లతో అధికారంలోరావాలని యత్నిస్తుందని ఆయన అన్నారు. జూబ్లిహిల్స్ వెనుకబాటుతనానికి బిఆర్ఎస్ పూర్తి భాధ్యత వహించాలన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు బిజెపికి పట్టం కట్టడానికి సిద్దంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలకు ప్రజలు తగిన రీతిలో గుణ పాఠం చెప్పగలరని కిషన్ రెడ్డి అన్నారు.

Read More
Next Story