![Telangana |సెక్రటేరియెట్ భవన నాణ్యతపై కాంగ్రెస్,బీఆర్ఎస్ ‘ఎక్స్’ వార్ Telangana |సెక్రటేరియెట్ భవన నాణ్యతపై కాంగ్రెస్,బీఆర్ఎస్ ‘ఎక్స్’ వార్](https://telangana.thefederal.com/h-upload/2025/02/13/512487-telangana.webp)
తెలంగాణ సచివాలయ భవనం
Telangana |సెక్రటేరియెట్ భవన నాణ్యతపై కాంగ్రెస్,బీఆర్ఎస్ ‘ఎక్స్’ వార్
తెలంగాణ సచివాలయ భవనం పెచ్చులూడిన ఘటనపై కాంగ్రెస్,బీఆర్ఎస్‌ల మధ్య ఎక్స్ పోస్టుల వార్ మొదలైంది. కాంగ్రెస్ నాణ్యత లోపం అంటే కాదుకాదు అంటూ బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది.
తెలంగాణ సచివాలయమైన డాక్టర్ అంబేద్కర్ భవనం దక్షిణం వైపు అయిదో అంతస్తు నుంచి పెచ్చులు ఊడి కింద పడ్డాయి. భవనంపై నుంచి ఊడి పడిన పెచ్చులతో పార్కింగ్ చేసి ఉన్న రామగుండం మార్కెట్ కమిటీ ఛైర్మన్ కారు దెబ్బతింది.
- కేబుల్ వేయడానికి డ్రిల్ చేస్తుండగా పెచ్చులు ఊడి కింద పడ్డాయని, రెగ్యులర్ కేబుల్ లైటింగ్ పనుల్లో ఇది భాగమని సెక్రటేరియెట్ భవన నిర్మాణ సంస్థ వివరణ ఇచ్చింది.
సచివాలయ భవనం పెచ్చులూడిన ఘటనపై అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ ల మధ్య ఎక్స్ లో వార్ మొదలైంది. ‘‘ మీ అవినీతికి సాక్ష్యాలివిగో ’’ అంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ఎక్స్ లో ఓ వీడియోను పోస్టు చేసింది. ‘‘గత పదేళ్ల పాలనలో అవినీతి బాగోతాలు ఒక్కొక్కటి వెలుగుచూస్తున్నాయి,మొన్న మేడిగడ్డకు గండి, సుంకిశాల ప్రాజెక్టు గోడ కూలింది. సైకిల్ ట్రాక్ డ్యామేజీ గత ప్రభుత్వం వందల కోట్లాదిరూపాయలు ఖర్చు చేసి నిర్మించిన సచివాలయంలో నాణ్యత లోపం బయటపడింది’’ అంటూ కాంగ్రెస్ వీడియోను పోస్టు చేసింది. బీఆర్ఎస్ నేతల కాసుల కక్కుర్తికి పరాకాష్టగా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం పేర్కొంది.
మీ అవినీతికి.. సాక్ష్యాలివిగో.. pic.twitter.com/C6TljRLo6a
— Telangana Congress (@INCTelangana) February 12, 2025
జూటా రేవంత్ ఫేక్ న్యూస్ అంటూ బీఆర్ఎస్ కౌంటర్ పోస్టు
సచివాలయ భవనం పెచ్చులూడిన ఘటనపై బీఆర్ఎస్ నిర్మాణ సంస్థ షాపూర్ జీ పల్లంజీ వివరణను ఉటంకిస్తూ కౌంటర్ ఇచ్చింది. ‘‘కాంగ్రెస్ క్లెయిమ్: సెక్రటేరియట్ నిర్మాణంలో నాణ్యత లోపం ఉంది. 5వ అంతస్తు నుండి ఊడిన పెచ్చులు.
ఫ్యాక్ట్ (నిజం):
సెక్రటేరియట్‌లో 5, 6వ అంతస్తుల్లో కేబుల్, లైటింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఇటీవలి మరమ్మతులలో భాగంగా.. లైటింగ్ కోసం, కొత్త కేబుల్స్ కోసం జీఆర్సీ (GRC) ఫ్రేమ్‌పై డ్రిల్లింగ్ చేపట్టారు. డ్రిల్ చేస్తే జీఆర్సీ డ్యామేజ్ అవుతుంది.ఇది నిర్మాణ లోపం కాదు, అలాగే కాంక్రీట్ పనితో సంబంధం లేదు. సెక్రటేరియట్ భవన నిర్మాణానికి ఎలాంటి ముప్పు లేదు.
ఈ ఘటనపై షాపూర్ జీ పల్లోంజి నిర్మాణ సంస్థ స్పందన:
• గత కొన్ని నెలలుగా సచివాలయం 5వ, 6వ అంతస్తుల్లో మరమ్మత్తులు, మార్పులు కొనసాగుతున్నాయి.
• ఐదో అంతస్తులో పనిచేస్తున్న సిబ్బంది డ్రిల్లింగ్ చేస్తున్న సమయంలో పెచ్చులు ఊడిపోయాయి.
• రెగ్యులర్ డిపార్ట్‌మెంట్ పనులలో భాగంగా కేబుల్, లైటింగ్ కోసం మరమ్మతులు జరుగుతున్నాయి.
• ఇది నిర్మాణ సమస్య కాదు. కాంక్రీట్ వర్క్‌కు సంబంధం లేదు, ఊడిపోయింది జీఆర్సీ ఫ్రేమ్ మాత్రమే.
• డ్రిల్ చేస్తే జీఆర్సీ డ్యామేజ్ అవుతుంది
• స్ట్రక్చర్ నిర్మాణం పూర్తయి రెండేళ్లు అవుతుంది, ఎలాంటి నాణ్యత లోపం లేదు.’’
కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎక్స్ ట్వీట్ల వార్ పై నెటిజన్లు పలు వ్యాఖ్యలు చేశారు.
క్లెయిమ్: సెక్రటేరియట్ నిర్మాణంలో నాణ్యత లోపం ఉంది. 5వ అంతస్తు నుండి ఊడిన పెచ్చులు.
— BRS Party (@BRSparty) February 13, 2025
ఫాక్ట్ (నిజం):
సెక్రటేరియట్‌లో 5వ మరియు 6వ అంతస్తుల్లో కేబుల్, లైటింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఇటీవలి మరమ్మతులలో భాగంగా.. లైటింగ్ కోసం, కొత్త కేబుల్స్ కోసం జీఆర్సీ (GRC) ఫ్రేమ్‌పై డ్రిల్లింగ్… pic.twitter.com/kALPBNoBj4
Next Story