
బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును తగలబెట్టిన కాంగ్రెస్
ఒకపుడు కాంగ్రెస్ పార్టీ ఆఫీసును ఫిరాయింపు ఎంఎల్ఏ రేగా కాంతారావు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుగా మార్చేశారట
తెలంగాణలో రాజకీయాలు హింసాత్మకం అయిపోతున్నాయి. ఇపుడు విషయం ఏమిటంటే ఆదివారం ఉదయం ఉమ్మడి ఖమ్మం జల్లాలోని మణుగూరు బీఆర్ఎస్(BRS) పార్టీ ఆఫీసును కాంగ్రెస్(Telangana Congress) పార్టీ నేతలు, కార్యకర్తలు ధ్వంసంచేశారు. కారణం ఏమిటంటే ఒకపుడు కాంగ్రెస్ పార్టీ ఆఫీసును ఫిరాయింపు ఎంఎల్ఏ రేగా కాంతారావు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుగా మార్చేశారట. ఆఫీసును తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఇవ్వమని అడుగుతున్నా రేగా పట్టించుకోవటంలేదన్న కోపంతో కాంగ్రెస్ శ్రేణులు దాడిచేసి ఫర్నీచర్ మొత్తాన్ని తగలబెట్టేశారు.
2018 ఎన్నికల్లో పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసిన రేగా కాంతారావు తర్వాత బీఆర్ఎస్ లోకి ఫిరాయించారు. కాంగ్రెస్ ఎంఎల్ఏగా ఉన్నపుడు వాడుకున్న ఆఫీసును బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుగా మార్చేశారు. ఆఫీసును ఖాళీచేసి తిరిగి కాంగ్రెస్ పార్టీకి అప్పగించమని స్ధానికనేతలు ఎన్నిసార్లు అడిగినా రేగా ఏమాత్రం లెక్కచేయలేదు. విసిగిపోయిన పార్టీ నేతలు ఈరోజు పార్టీ ఆఫీసుపై దాడిచేసి ఫర్నీచర్ మొత్తాన్ని తగలబెట్టేశారు. విషయం తెలియగానే పోలీసులు, ఫైర్ స్టేషన్ సిబ్బంది ఘటనా స్ధలానికి చేరుకున్నారు. ఫర్నీచర్ ను తగలబెట్టిన కాంగ్రెస్ నేతలు పార్టీ ఆఫీసును స్వాధీనం చేసుకుని ఆపీసుపై కాంగ్రెస్ జెండాను ఎగరేశారు. దీని పర్యవసానాలు ఎలాగుంటాయో చూడాలి.

