Deputy CM Bhatti Vikramarka
x

‘మహిళలకు రూ.లక్ష కోట్ల రుణాలు’

మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.


మహిళాసాధికారతే ధ్యేయంగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. అన్ని దశల్లో కూడా తాము మహిళలకు, వారి సంఘాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తమ ఐదేళ్ల పరిపాలనా కాలంలో మహిళలకు రూ.లక్ష కోట్ల రుణాలు ఇవ్వడమే టార్గెట్‌గా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, వారికి ఆర్థికంగా స్థిరత్వం కల్పించడం కోసం ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రజాభవన్‌లో జరుగుతున్న ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా.. మహిళల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పనులను భట్టి వివరించారు. ఆర్టీసీకి అద్దె బస్సులు అందించిన మహిళా సంఘాలకు తమ ప్రభుత్వం చెక్కులు పంపిణీ చేసిందని, తొలి నెల అద్దె కింద ఆయా సంఘాలకు రూ.1.49 కోట్లు ఇచ్చామని చెప్పారు. మహిళలకు ఏదో కొంత మొత్తంలో నగదు ముట్టజెప్పి చేతులు దులుపుకోవడం తమకు రాదని, అందుకే వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడం కోసం ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే మహిళలను వ్యాపారవేత్తలు తీర్చిదిద్దే కార్యక్రమం షురూ అయిందని కూడా అన్నారు.

‘‘ఈనెల 8న రాష్ట్రంలోని అన్ని మండలాల్లో ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చించాలి. మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, చేకూరుస్తున్న లబ్ధిని ప్రతి ఒక్కరికీ వివరించాలి. ఈ నెల 10-16 మధ్య అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమావేశాలు ఉంటాయి. వడ్డీలేని రుణాల నగదును చెక్కుల రూపంలో అందిస్తాం. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయంపై ప్రజలకు అవగాహన కల్పించాలి’’ అని తెలిపారు.

Read More
Next Story