కాంగ్రెస్ ఏ ఒక్క హామి నెరవేర్చలేదు
x
BRS working president KTR

కాంగ్రెస్ ఏ ఒక్క హామి నెరవేర్చలేదు

మజ్లిస్ నేతలను గులాబీ పార్టీలోకి ఆహ్వానించిన కెటిఆర్


గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామిల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని బిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. శుక్రవారం మజ్లిస్ పార్టీకి చెందిన నాయకులకు గులాబీ కండువా కప్పి ఆయన ఆహ్వానించారు. తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. అధికారంలో రావడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎన్నో హామిలు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. మహిళలకు తులం బంగారం, వృద్దులకు నాలుగు వేల పెన్షన్, యువతులకు స్కూటిలు వంటి నోటికొచ్చిన హామీలను కాంగ్రెస్ ఇచ్చిందని కెటిఆర్ ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామిల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదని కెటిఆర్ అన్నారు. రెండేళ్లు రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసిన కాంగ్రెస్ పార్టీకి జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు తగిన రీతిలో గుణ పాఠం చెప్పాలని కెటిఆర్ పిలుపునిచ్చారు.


డబ్బులను ప్రలోభపెట్టి గెలవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందని, ఇచ్చిన డబ్బులు తీసుకుని మిగతా డబ్బులు ఎప్పుడు ఇస్తారో నిలదీయాలని కెటిఆర్ పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు కారుకు, బుల్డోజర్ మధ్య జరుగుతున్న ఎన్నికలు అని ఆయన అభివర్ణించారు. హైడ్రా పేరిట పేదల ఇళ్లను కూల్చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణ పాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను బెదిరించడానికి ప్రయత్నిస్తుందని , ఎవరూ కూడా భయపడొద్దని, ఒక వేళ భయపెట్టడానికి ప్రయత్నిస్తే ప్రజలు బిఆర్ఎస్ కు ఫిర్యాదు చేయాలని కెటిఆర్ అన్నారు.

Read More
Next Story