
కాంగ్రెస్ నేత మధుయాష్కి గౌడ్‌కు తీవ్ర అస్వస్థత..
ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఇంకా రాని క్లారిటీ.
కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం సాయంత్రం ఆయన సచివాలయానికి వచ్చారు. అక్కడ మంత్రి శ్రీధర్‌బాబు పేషీలో ఉన్న సమయంలోనే ఒక్కసారిగా ఛాతీ నొప్పి అంటూ కుప్పకూలిపోయారు. వెంటనే స్పందించిన సిబ్బంది ఆయనను హుటాహుటిన సచివాలయం డిస్పెన్సరీలో ప్రథమ చికిత్స అందించారు. అనంతరం ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. కాగా ఆయన ఆరోగ్యంపై ఆయన అనుచరులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఏ విషయం చెప్పలేదని, ఛాతీ నొప్పి హార్ట్‌ఎటాక్ వల్ల వచ్చిందా? లేకుండా మరేదైనా కారణమా? అన్న అంశాన్ని వైద్యులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. రేపు ఉదయానికి ఆయన ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ రావొచ్చని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
Next Story