రెండో విడతలోనూ హస్తం హవా !
x

రెండో విడతలోనూ హస్తం హవా !


రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మద్దతు దారులే ముందంజలో ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం మొదలైన కౌంటింగ్‌లో ఆరంభం నుంచి కాంగ్రెస్ మద్దతు దారులు ముందంజలో ఉన్నారు. రెండో దశలో మొత్తం 4,332 సర్పంచ్‌ స్థానాలకు ఎన్నికలు జరగగా, ఇప్పటికే 415 సర్పంచ్‌ స్థానాలు, 8,307 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఆదివారం 3,911 సర్పంచ్‌ స్థానాలు, 29,913 వార్డు స్థానాలకు పోలింగ్‌ జరిగింది. పోలింగ్‌ ముగిసిన అనంతరం అధికారులు కౌంటింగ్‌ ప్రక్రియను చేపట్టారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.

ఫలితాలపై రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొనగా, గ్రామీణ స్థాయిలో ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ మద్దతు దారులు 1855 స్థానాల్లో, బీఆర్ఎస్ మద్దతు 948 దారులు స్థానాల్లో, బీజేపీ మద్దతు దారులు 198 స్థానాల్లో, ఇతరులు 502 స్థానాల్లో విజయం సాధించారు. ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.

Read More
Next Story