
చంద్రబాబు కోవర్ట్ లు ప్రభుత్వంలో ఉన్నారు
కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ సంచలన వ్యాఖ్యలు
నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఎక్కే జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ తాజాగా మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కోవర్ట్ లు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు కోవర్ట్ లు ఉన్నారని ఆయన కాంగ్రెస్ మంత్రులనుద్దేశించి వ్యాఖ్యానించారు. బనకచర్ల ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బహిరంగ లేఖలు రాసినంత మాత్రాన ప్రయోజనం లేదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ప్రభుత్వానికి సూచన చేస్తున్నాను అని అనిరుధ్ అన్నారు. ఇరిగేషన్, రోడ్డు కాంట్రాక్టులు చూసేది చంద్రబాబు కోవర్టులే అని అనిరుద్ కామెంట్ చేశారు. అనిరుద్ కామెంట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది.
చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారని మరో వైపు బిఆర్ ఎస్ నేత హరీష్ రావు చేస్తున్నఆరోపణలకు బలం చేకూరే విధంగా అనిరుద్ వ్యాఖ్యలున్నాయి.అనిరుధ్ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమిస్తుందా అనేది వేచి చూడాల్సిందే.