Rammohan Reddy | ‘కేటీఆర్‌కు రేవంత్ అక్కర్లేదు.. నేను చాలు’
x

Rammohan Reddy | ‘కేటీఆర్‌కు రేవంత్ అక్కర్లేదు.. నేను చాలు’

దమ్ముంటే కేటీఆర్.. సిరిసిల్లలో ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఉపఎన్నికకు రావాలంటూ ఛాలెంజ్ చేశారు.


‘‘ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కొడంగల్‌లో ఉపఎన్నికకు రేవంత్ రావాలి. ఆయన 50వేల మెజార్టీ కన్నా ఒక్క ఓటు మెజార్టీతో గెలిచినా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఉపఎన్నిక జరిగితే మా నేత పట్నం నరేందర్ విజయం సాధిస్తారు. దమ్ముంటే ఈ ఛాలెంజ్‌కు రేవంత్ రావాలి’’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలెంజ్ చేశారు. కాగా కేటీఆర్ సవాళ్‌కు పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కేటీఆర్‌కు రేవంత్ అవసరం లేదని, రామ్మోహన్ రెడ్డే చాలా ఎక్కువని అన్నారు. దమ్ముంటే కేటీఆర్.. సిరిసిల్లలో ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఉపఎన్నికకు రావాలంటూ ఛాలెంజ్ చేశారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.


అసెంబ్లీలో ఛాలెంజ్ చేశా

‘‘కేటీఆర్‌కు దమ్ముంటే ధైర్యం ఉంటే కొడంగల్ లో ఒక జడ్పీటీసీ లేదా ఎంపీపీ గెలవాలి. రాజీనామా కు మా నాయకుడు రేవంత్ రెడ్డి అవసరం లేదు.. నేను సిద్ధంగా ఉన్నా. గతంలో నేను కేటీఆర్, హరీష్ రావు కు అసెంబ్లీలోనే రాజీనామా సవాల్ విసిరాను. రాజీనామా పైన కేటీఆర్, హరీష్ రావు ఇప్పటి వరకు స్పందించలేదు. కేటీఆర్‌కు దమ్ము, ధైర్యం ఉంటే సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. కేకే మహేందర్ రెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించుకుంటాం. ఆరిపోయే దీపంలా కేటీఆర్ మాట్లాడుతున్నారు. జైలుకు పోతామన్న భయంతోనే ఊక దంపుడు ఉపన్యాసాలు చేస్తున్నాడు. హైదరాబాద్ నుంచి మనుషులను తీసుకెళ్లి దారి పొడువునా కేటీఆర్ షో చేస్తున్నాడు. పగటి వేషగాడి లా కేటీఆర్ మాటలున్నారు’’ అని విమర్శించారు.

‘‘కేటీఆర్ కోస్గి పట్టణంలో ఉల్టా చోర్ కొత్వాల్ కే డాంటే అన్నట్లు ఉంది. కొడంగల్ ప్రజలకు అభివృద్ధి భరోసా కల్పించారు. గతంలో రైతులు వరి వేస్తే ఉరే అన్నాడు కెసిఆర్. కానీ రేవంత్ రెడ్డి వరి పండించండి.. కేసీఆర్ ఫాం హౌస్ వద్ద పోసి నిరసన చేద్దాం.. ఎట్లా కొనారో చూద్దాం అని రైతన్నలకు భరోసా ఇచ్చారు. అభివృద్ధి కోసం సీఎం ప్రణాళికలు వేస్తుంటే.. రైతులను రెచ్చగొట్టేందుకు 50 కోట్లు పంపి అధికారుల మీద దాడులు చేయించావు. పరిగి లో రైతు రుణమాఫీ ఎంత అయ్యిందో నిరూపిస్తా అని కేటీఆర్ కి సవాల్ చేస్తే.. స్వీకరించకుండా పారిపోయాడు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

‘‘కేసీఆర్ చేసింది రుణమాఫీ కాదు.. వడ్డీ మాఫీ. పదేళ్లు రేషన్ కార్డులు ఇవ్వకుండా.. ఉప ఎన్నికలు ఉన్న చోట మాత్రమే రేషన్ కార్డులు ఇచ్చారు. వ్యవసాయం చేసే భూములకు రైతు భరోసా ఇస్తున్నాం. ఒక ఎకరం వరకు రైతు భరోసా పడింది. త్వరలో సాగు చేసే ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తాం. పరిగి,వికారాబాద్,తాండూరు లో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు.. ఒక్క రేషన్ కార్డు ఇచ్చినట్లు చూపించండి. కేటీఆర్ కి రేవంత్ రెడ్డి అవసరం లేదు.. రామ్మోహన్ రెడ్డి చాలు. సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా కేటీఆర్ చేసి. ఎవరి పాలన బాగుందో ప్రజలు చెబుతారు. దమ్ముంటే రాజీనామా చెయ్యి ప్రజలు చెబుతారు. కొడంగల్ అభివృద్ది చూసి కేటీఆర్ కండ్లు మండుతున్నాయి. కేటీఆర్ కి దమ్ముంటే సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. కొడంగల్ లో నువ్వు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పకుండా.. రైతులను రెచ్చగొడుతున్నారు’’ అని మండిపడ్డారు.

Read More
Next Story