కాంగ్రెస్ పార్టీకి అవినీతి వైరస్ సోకింది: బండి సంజయ్
x

కాంగ్రెస్ పార్టీకి అవినీతి వైరస్ సోకింది: బండి సంజయ్

విచిత్రమైనా వ్యాధి సోకుతదని పంచాంగం చెబుతుంది..కాంగ్రెస్ ‌పాలన చూస్తే కరెక్ట్ అని కనిపిస్తుందని బండి చురకలంటించారు.


ఉగాది పండగ వేళ బీజేపీ ఎంపీ, కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మజ్లిస్ పార్టీపై హాట్ కామెంట్స్ చేశారు. ప్రజలందరికీ విశ్వవాసు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. ఈ ఏడాది ప్రజలందరికీ ఆదాయం సమృద్ధిగా పెరగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో గడపాలని కోరుకుంటున్నానని, ప్రధాని మోదీ పాలనలో భారతదేశం ఆర్థిక ప్రగతిలో దూసుకుపోతోందని చెప్పుకొచ్చారు. మోదీ చేస్తున్న కృషిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ ఏడాది దొంగతనాలు ఎక్కువ అవుతాయని, ప్రజాప్రతినిధులు, అధికారులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడతారని, కొత్త వ్యాధి ప్రభలుతుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలన చూస్తుంటే పండితులు చెప్తున్నది నిజమే అనిపిస్తుందని వ్యాఖ్యానించారు.

‘‘కాంగ్రెస్ పార్టీ కి అవినీతి వైరస్ సోకింది. విచిత్రమైనా వ్యాధి సోకుతదని పంచాంగం చెబుతుంది..కాంగ్రెస్ ‌పాలన చూస్తే కరెక్ట్ అని కనిపిస్తుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ వలన తెలంగాణ లో పింక్ వ్యాధి సోకింది. ఇప్పుడు ‌అవినీతి వైరస్ కి వ్యాక్సిన్ బిజేపి ఇవ్వబోతుంది. కాంగ్రెస్ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాలు చెబడుతాం. రేషన్ బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం.... ఒక్కోక్క కిలోకి నలభై రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది’’ అని తెలిపారు.

‘‘సన్నబియ్యంలో‌ కాంగ్రెస్ ప్రభుత్వం పది రూపాయలే ఇస్తుంది. రేషన్ షాపులలో ప్రధాని మోడి ఫొటో పెట్టాలి. రేవంత్ రెడ్డి పదేండ్లపాటు సియంపై. కేసీఆర్‌పై పగ తీర్చుకోలేను అని రేవంత్ రెడ్డి అంటున్నారు. అవినీతి కి పాల్పడ్డవారిని జైలుకు పంపితే పగ తీర్చుకున్నట్లా? కేసీఆర్, రేవంత్ రెడ్డి ఒక్కటే. కేసీఆర్‌కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేస్తే ఏం మిగిలింది. ఫోన్ ట్యాపింగ్ కేసు విషయం లో బెయిల్ వచ్చిందంటే కేసు నీరు కారినట్లే. బెట్టింగ్ యాప్‌లో కేసీఆర్ కుటుంబం పేరు వచ్చింది. కేసీఆర్ ‌కుటుంబానికి‌ ఒక్క నోటీసు ఇవ్వలేదు’’ అని అన్నారు.

‘‘బీఆర్ఎస్, కాంగ్రెస్ దేశద్రోహుల పార్టీ. బాష, ప్రాంతం పేరుతో దేశాన్ని విభజించే ప్రయత్నం నడుస్తుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ లిక్కర్ కూటమి. హైదరాబాదు లో‌ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎంఐఎం పార్టీని గెలిపించడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు‌ అభ్యర్థి ని పెట్టడం లేదు. హైదరాబాద్ లొకల్ బాడి ఎన్నికలలో మూడు పార్టీలు ఎంఐఎం పార్టీ ని ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిపించాలని చూస్తున్నాయి. హైదరాబాదు లోకల్ బాడి ఎన్నికల తరువాత బండారం బయటపడితది. బీఆర్ఎస్‌లో ఉంటే ఏమిటి కాంగ్రెస్ లో ఉంటే ఎమిటి రెండుపార్టీలు ఒకటే’’ అని విమర్శించారు.

‘‘ఒవైసీ అడ్డుకుంటే వక్స్ బోర్డు బిల్లు ఆగదు. ఆర్ఎస్ఎస్ అంటే కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలకి భయం. ఆర్ఎస్ఎస్ దేశం కొసం, దర్మం కొసం పనిచేస్తుంది. మసీదులు, ధారుసాలెం ఉగ్రవాదులకు అడ్టాగా మారింది. ముస్లిం ‌సమాజం అంతా‌ ఎంఐఎంకి‌ అండగా ఉంటదని అనుకుంటే తెలంగాణ అంతటా పోటీ చేయాలి’’ అని అన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ కి దమ్ముంటే లోకల్ బాడీ ఎన్నికలలో పోటీ చేయాలి అని ఛాలెంజ్ చేశారు.

Read More
Next Story