వీళిద్ధరిలో ఒకరు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులువుతారా?
x

డాక్టర్ జి చిన్నారెడ్డి, ప్రొఫెసర్ కోదండరామ్

వీళిద్ధరిలో ఒకరు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులువుతారా?

రాహుల్ గాంధీ సలహాదారుగా ఉన్న మాజీ ఐఎఎస్ అధికారి కె రాజు ను తెలంగాణ నుంచి రాజ్యసభకు నామినేట్ చేయవచ్చని కూడా ఒక టాక్ వినబడుతూ ఉంది.


తెలంగాణ నుంచి ముగ్గురు రాజ్యసభ్యులు ఈ ఏడాది రిటైర్ అవుతున్నారు. వారంతా బీఆర్ఎస్ సభ్యులే.వారి పేర్లు జోగినపల్లి సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర, బి. లింగయ్య యాదవ్ . వారందరి పదవీ కాలం ఏప్రిల్ 2న పూర్తవుతుంది. వీరంతా 2018లో రాజ్యసభక ఎన్నికయ్యారు.

గతంలో కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభలో సభ్యత్వంలేదు. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకీ రాజ్యసభకు ఒక నేతను పంపే అవకాశం లభిస్తూ ఉంది. ఇపుడున్న బలగంతో కాంగ్రెస్ నుంచి ఒకరిని కచ్చితంగా రాజ్యసభకు పంపవచ్చు. ఇలాగే బిఆర్ ఎస్ కూడా ఒకరిని పంపవచ్చు. మూడో సభ్యుడివిషయంలో కొంత ఉత్కంఠ ఉంటుంది. మూడో సభ్యుడిని గెల్చుకోవాలంటే బిఆర్ ఎస్ కు బలగం లేదు. ఎంఐఎం మద్దతు ఇచ్చినా సాధ్యంకాదు. ఇలాగే బలం ఉన్నా మూడోసీటు గెల్చుకునేంత సంఖ్య కాంగ్రెస్ కు లేదు. దీనిమీద వ్యూహమేమిటో కాంగ్రెస్ వర్గాలనుంచి ఎలాంటి సమాచారం బయటకు పొక్కడం లేదు.

అయితే, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ ను రాజ్యసభకు పంపించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆయన కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించి గత ఎన్నికల్లో పోటీ చేయలేదు. దానికి తోడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటెలెక్చువల్ మద్దతు అందిస్తూ వస్తున్నారు. తెలంగాణను తెచ్చింది టిఆర్ ఎస్ కాదు, కెసిఆర్ కాదు, పోరాడింది ప్రజలు, ఇచ్చింది సోనియాగాంధీ అనే ఐడియాలజికల్ క్యాంపెయిన్ ను ఆయన కాంగ్రెస్ తో చేయించబోతున్నారు. కాబట్టి ఆయనకు సముచిత గౌరవమివ్వాలని పార్టీలో ఒక ఆలోచన ఉంది. ఈనేపథ్యంలో ఆయన్ని రాష్ట్రంలోనే ప్రభుత్వంలో ఒక కీలమయిన బాధ్యత ఇచ్చి హైదరాబాద్ లోనే ఉంచుకుంటారా లేక పెద్దల సభగా పేరున్న రాజ్యసభ కు పంపిస్తారా అనేది తేలడం లేదు. ఆయనను రాజ్యసభకు పంపే అవకాశం ఎక్కువగా ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. పెద్దల సభలో కూర్చునేందుకు ప్రొఫెసర్ కొదండరామ్ సుముఖంగా ఉన్నట్లు తెలిసింది.

ఇలాగే కాంగ్రెస్ వర్గాల్లో వినబడుతున్న మరొక పేరు డాక్టర్ జి చిన్నారెడ్డి. ఈ సారి ఆయన వనపర్తి టికెట్ ఇవ్వలేదు. ఇది చాలా మందికి నచ్చలేదు. ఉన్నత విద్యావంతుడు, ఇంగ్లీష్, హిందీలో మాట్లాడగలిగే సత్తా ఉంది కాబట్టి ఆయనను రాజ్యసభకు పంపే అవకాశం ఉన్నట్లు ఆయన సన్నిహితులొకరు తెలిపారు. అయితే, బిసి వర్గానికో, ఎస్సి వర్గానికో కేటాయించాలన్న ఆలోచన కూడా పార్టీలో ఉందని తెలిసింది. అదే జరిగితే, రెండు పేర్లు వినబడుతున్నాయి. ఇందులో ఒకరు బిసి నాయకుడు, మొన్న ఎల్ బినగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మధు యాస్కి కాగా మరొకరు, రాహుల్ గాంధీకి సలహాదారుగా ఉన్న మాజీ ఐఎఎస్ అధికారి కె. రాజు.

లోకసభ ఎన్నికలు ఖర్చుతో కూడుకున్నవ్యవహారం కాబట్టి దానిని దృష్టిలో ఎవరైనా ఒక పారిశ్రామిక వేత్తను నామినేట్ చేసిన ఆశ్చర్యంలేదనే టాక్ కూడా కాంగ్రెస్ వర్గాల్లో వినబడుతూ ఉంది.

బిఆర్ ఎస్ వ్యవహారం

కెసిఆర్ కుటుంబ సభ్యుడైన సంతోష్ ను భారత రాష్ట్రసమితి రీనామినేట్ చేస్తుందా లేక మంచి డబ్బున్న వ్యాపారస్థుడికి సీటుఇస్తుందా తెలియడం లేదు. సంతోష్ కుమార్ రాజ్యసభలో పర్ ఫామెన్స్ జీరో. రాష్ట్రంలో అధికారంలో ఉన్నపుడు ప్రభుత్వ సహకారంతో ఆయన చెట్లునాటుకుంటూ కాలక్షేపం చేశారు. వృక్ష మిత్ర అయ్యారు. ఇపుడు ఆయన చెట్లు నాటే కార్యక్రమం మానేస్తారు. మాటలు రాని వ్యక్తిని రాజ్యసభకు పంపించి, అందునా రాష్ట్రంలో అధికారంలేనపుడు, చేసేదేమీలేదు కాబట్టి నోరు తెరిచి నాలుగు ముక్కలు మాట్లాడే వాళ్లను పంపించాలని పార్టీ భావించవచ్చ. అందువల్ల కవితను పంపిస్తారా. ఎందుకంటే. 2024 లోక్ సభ ఎన్నికల్లో బిఆర్ ఎస్ పనితీరు గొప్పగా ఉంటుందనేందుకు అవకాశమలేదు. కాంగ్రెస్ పార్టీ ఇంకా 6 గ్యారంటీలు అమలుచేయలేదనే స్లోగనే తప్ప మరొక స్లోగన్ ఈ పార్టీకి లేదు. మహారాష్ట్రంలో ప్రచారం చేస్తూ వచ్చిన తెలంగాణ మోడెల్ ఫెయిలయింది. సంక్షేమ పథకాలు పనిచేయలేదు. కెసిఆర్ ఉద్యమ నేత అనే సానుభూతి కూడా తగ్గిపోయింది.అందువల్ల కల్వకుంట్ల కవితని లోక్ సభకు పోటీ చేయిస్తే ఓడే ప్రమాదం ఉంటుంది. సురక్షితంగా ఆమెను రాజ్యసభకు పంపింవచ్చని కూడా పార్టీ వర్గాల్లో వినబడుతూ ఉంది. అయితే, కుటుంబానికే అన్ని ఉద్యోగాలా అనేది మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బాగా వినబడిన ప్రశ్న. ప్రజలుకూడా సీరియస్ గా తీసుకున్న విమర్శ. దీనిని బిఆర్ ఎస్ సీరియస్ గా తీసుకుంటే కుటుంబ సభ్యులకు అవకాశమే రాకపోవచ్చు.

దేశ వ్యాప్తంగా తొమ్మిది మంది కేంద్ర మంత్రులతో సహా 68 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఈ ఏడాదితో పూర్తవనుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పీ నడ్డా కూడా ఉన్నారు. మిగతా వారిలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్. ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాదవ్య. తో సహా 57 మంది రాజ్యసభ ఎంపీల పదవీకాలం ఏప్రిల్.లో పూర్తవుతుంది..

రాష్ట్రాలవారీగా ఈ ఏడాది ఖాళీ అవుతున్న సీట్లు ఇవే...

గుజరాత్ - 4, ఒడిశా - 3, తెలంగాణ -3, కేరళ - 3, ఉత్తరప్రదేశ్ - 10 సీట్లు, మహారాష్ట్ర - 6, బీహార్ - 6, ఉత్తరాఖండ్ - 1, హిమాచల్ ప్రదేశ్ - 1, హర్యానా - 1, ఛత్తీస్,గఢ్ - 1,

మధ్యప్రదేశ్ - 5, పశ్చిమ బెంగాల్ - 5, కర్ణాటక - 4, ఆంధ్రప్రదేశ్ - 3, జార్ఖండ్ - 2, రాజస్థాన్ - 2,

Read More
Next Story