Kavitha | ‘చైనా ఫోన్‌లా కాంగ్రెస్ పాలన..’
x

Kavitha | ‘చైనా ఫోన్‌లా కాంగ్రెస్ పాలన..’

అధికారం వచ్చినప్పటి నుంచి ప్రజలను మోసం చేయడమే ప్రధా ధ్యేయంలా రేవంత్ పాలన ఉందంటూ కవిత మండిపడ్డారు.


తెలంగాణలో కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు కురిపించారు. అధికారం వచ్చినప్పటి నుంచి ప్రజలను మోసం చేయడమే ప్రధా ధ్యేయంలా రేవంత్ పాలన ఉందంటూ మండిపడ్డారు. జగిత్యాలలో నిర్వహించిన పార్టీ సమావేశంలో కవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి విమర్శలు వర్షం కురిపించారు. తెలంగాణలో కేసీఆర్ పాలన ఐఫోన్‌లా ఉంటే రేవంత్ పాలన చైనా ఫోన్‌లా ఉందని చురకలంటిచారు. పదేళ్ల పాటు రాష్ట్రంలో ఐఫోన్‌లా స్థిరమైన పనితీరును కేసీఆర్ సర్కార్ కనబరిచిందని, ఇప్పుడు రేవంత్ పాలన అచ్చం ఐఫోన్‌ తరహాలోనే బయటకు బాగుండి లోపల అన్నీ లోపాలే ఉన్నాయని విమర్శించారు. రేవంత్ రెడ్డి కూడా మాటలు బాగా చెప్తున్నారని, పథకాల అమలు విషయంలో కోతలు పెడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని, బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.

‘‘ఏ కులంలో ఎంత జనాభా ఉన్నారో లెక్కలు ఎందుకు బయటపెట్టడం లేదు? బీసీ సంఘాలతో మంత్రి పొన్నం ప్రభాకర్ తూతూ మంత్రంగా సమావేశాలు పెట్టడం కాదు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డే చర్చలు జరపాలి. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించే వరకు పోరాటం ఆగదు. మరో తెలంగాణ పోరాటం తరహాలో పోరు బాటపెట్టడానికి అందరూ సిద్ధంగా ఉండాలి’’ అని పిలుపునిచ్చారు. అన్నం పెట్టే రైతులకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని, వారికి అందాల్సిన పథకాల్లో కోతలు పెట్టడమే కాకుండా, ఇస్తామన్న బోనస్ ఇవ్వడం లేదని, ఆఖరిని నీళ్లు కూడా అందించడం లేదంటూ మండిపడ్డారు.

‘‘కాళేశ్వరం నీళ్లు విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతులను కష్టాల్లోకి నెట్టింది. ఎండిపోయిన పొలాలను చూస్తుంటే రైతులకు కన్నీళ్లు ఆగడం లేదు. కాంగ్రెస్‌కు రైతులను కాపాడే తెలివి లేదు. మరోవైపు ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయారు. ఆడపిల్లలకు స్కూటీలు, మహిళలకు రూ.2,500 సహాయం ఏమయ్యాయి? మహిళలను చిన్నచూపు చూస్తున్న రేవంత్ రెడ్డికి త్వరలోనే ప్రజలు గుణపాఠం చెబుతారు’’ అని అన్నారు కవిత.

Read More
Next Story