జూబ్లిహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలి
x

జూబ్లిహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలి

తెలంగాణ భవన్ లో కార్యకర్తల సమావేశంలో కెటిఆర్


జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామా రావు(KTR) పిలుపునిచ్చారు. ఆదివారం తెలంగాణ భవన్ లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. రేవంత్ రెడ్డి అధికారంలో వచ్చి రెండున్నర ఏళ్లు దాటుతున్నా ఇంకా కెసీఆర్ ను నిందించడం తన అసమర్ధతను చాటుతుందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామిలను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విస్మరించిందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామిలపై బాకీ కార్డ్ ఉద్యమాన్ని బిఆర్ఎస్ ప్రజల్లో తీసుకెళ్లిందని ఆయన అన్నారు. ప్రజల నుంచి మంచి స్పందనవచ్చిందన్నారు. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించి ప్రజలు తగిన గుణ పాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.

గరీబోళ్ల ఇళ్లపై హైడ్రా బుల్డోజర్లు పెట్టి కూల్చేస్తుందని ఆయన అన్నారు. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలలో కారు కావాలో బుల్డోజర్ కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నారు.

జూబ్లిహిల్స్ లో కాంగ్రెస్ ను గెలిపిస్తే అభివృద్ది జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటుంది. రెండున్నరేళ్ల నుంచి ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ అభివృద్ది ఎందుకు జరగడం లేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత సంపాదించిన అవినీతి సొమ్మును జూబ్లిహిల్స్ ఎన్నికల్లో ఖర్చు చేస్తుందని కెటిఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ వోటుకు పదివేల రూపాయలు ఖర్చుచేస్తుందని కెటిఆర్ ఆరోపించారు. బిజెపి తెలంగాణకు పనికి రాని పార్టీ ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ , బిజెపిలకు ఓటు వేస్తే మోరీలో వేసినట్టేనని కెటిఆర్ అన్నారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు ఆదివారం కెటిఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు. పార్టీలో చేరిన వారికి కెటిఆర్ సాదర స్వాగతం పలికారు. వారికి గులాబీ కండువా కప్పారు.

Read More
Next Story