
కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై భగ్గుమన్న కాంగ్రెస్
తెలంగాణ భవన్ ముట్టడి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులపై బిఆర్ ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పరుష వ్యాఖ్యలపై కాంగ్రెస్ భగ్గుమంది. ఆదివారం ( జూన్ 22) కాంగ్రెస్ పార్టీ తెలంగాణ భవన్ ను ముట్టడించింది. ఒక దశలో తెలంగాణ భవన్ లో కాంగ్రెస్ కార్యకర్తలు దూసుకెళ్లడానికి ప్రయత్నించారు. వారిని అడ్డుకున్న పోలీసులు కొద్ది సేపటి తర్వాత అదుపులో తీసుకున్నారు.
తెలంగాణ మంత్రులు ఇసుకదందాకు పాల్పడుతున్నారి కౌశిక్ రెడ్డి నిన్న వరంగల్ లో ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏకవచనంతో సంభోధిస్తూ కౌశిక్ రెడ్డి పరుషంగా మాట్లాడారు. మైనింగ్ వ్యాపారిని బెదిరించిన కేసులో కౌశిక్ రెడ్డి అరెస్టై బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. బెయిల్ పై విడుదలైన సందర్బంలోనే కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రి, మంత్రులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు.మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాజీ శిష్యుడైన కౌశిక్ రెడ్డి బిఆర్ఎస్ లో చేరి కెసీఆర్ అత్యంత సన్నిహితులుగా మారారు. రాజకీయాల్లో రాకమునుపు కౌ శిక్ రెడ్డి హైద్రాబాద్ జట్టుకు క్రికెట్ ప్లేయర్. లెప్ట్ హ్యాండ్ బౌలర్ గా పేరు తెచ్చుకున్న కౌశిక్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు.