హైకోర్టు స్టే ఇవ్వడానికి కాంగ్రెస్సే కారణమా..?
x

హైకోర్టు స్టే ఇవ్వడానికి కాంగ్రెస్సే కారణమా..?

రేవంత్ రెడ్డి సర్కార్ చేతకానితనం వల్లే స్టే వచ్చిందన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.


బీసీలకు 42శాతం రిజర్వేషన్ల జీవో-9పై తెలంగాణ హైకోర్టు స్టే ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభత్వమే కారణమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. హైకోర్టు నిర్ణయంపై బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు స్పందించారు. ఈ అంశంలో కాంగ్రెస్ చేతకానితనం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. జీఓపై న్యాయస్థానం స్టే ఇవ్వడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. దీనంతటికీ ప్రతిపక్షాలుగా ఉన్న పార్టీలే కారణమని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. జీఓ ఇవ్వగానే హైకోర్టులో పిటిషన్లు వారే వేయించారని, బీసీలకు రిజర్వేషన్లను రావడం ఇష్టం లేక ఒకరు పిటిషన్ వేయిస్తే, మరొకరు ఎక్కడ రేవంత్‌కు, కాంగ్రెస్‌కు పేరు వస్తుందో అని పిటిషన్ వేయించారని కాంగ్రెస్ నాయకలు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, రామచందర్ రావు స్పందించారు. స్టే రావడానికి అసలు కారణమే కాంగ్రెస్ అని రామచందర్ రావు పేర్కొన్నారు.

రిజర్వేషన్లకు బీజేపీ కట్టుబడి ఉంది: రామచందర్ రావు

‘‘బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు బీజేపీ కట్టుబడి ఉంది. అసెంబ్లీలో బీసీ బిల్లుకు, ఆర్డినెన్స్‌కు పూర్తిగా మద్దతు ఇచ్చాం. బీజేపీ ఎంపీ కృష్ణయ్య.. ఈ అంశంపై ఇంప్లీడ్ పిటిషన్ వేశారని చెప్పారు. గవర్నర్‌కు బిల్లు పంపి 3 నెలలకు కూడా ఓపిక పట్టలేదు కాంగ్రెస్. జీఓ ఇచ్చి షెడ్యూల్ ప్రకటించడంలో లోగుట్టు ఏంటి? కోర్టు స్టేకు ప్రభుత్వానిదే బాధ్యత. అది తెలుసుకోకుండా మా అభాండాలు వేయడం సరికాదు’’ అని రామచందర్ రావు వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ చేతకాని తనమే : కిషణ్

‘‘జీఓపై కోర్టు స్టే ఇచ్చిందంటే అందుకు కాంగ్రెస్ చేతకాని తనమే కారణం. బీసీ రిజర్వేషణ్లపై రాస్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదు. ప్లాన్-బీ రెడీగా పెట్టుకునే కోర్టులో తూతూమంత్రంగా వాదనలు వినిపించారు. బీసీలను హస్తం పార్టీ రాజకీయంగా వాడుకుంటోంది. కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నప్పుడే సుప్రీంకోర్టు రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని విధించింది. కనీస అవగాహన లేకుండా రేవంత్ సర్కార్ వ్యవహరించింది’’ అని కిషన్ రెడ్డి వివరించారు.

Read More
Next Story