GST తగ్గింపు వల్ల నిర్మాణ రంగానికి పెద్ద ప్రయోజనం ఉండదు...
x
Representative image

GST తగ్గింపు వల్ల నిర్మాణ రంగానికి పెద్ద ప్రయోజనం ఉండదు...

ఈ కొద్ది రిలీఫ్ ని బిల్డర్లు కొనుగోలుదారులకు నిజంగా అందిస్తారా?


(హైదరాబాద్ బ్యూరో)


కేంద్రం ప్రకటించిన కొత్త జీఎస్టీ రేట్ ల వలన కొంత ఉపశమనం లభించినా పెద్దఎత్తున ప్రభావం ఉండదని రియల్ ఎస్టేట్ రంగం తో సంబంధం ఉన్న వివిధ వర్గాలు అభిప్రాయ పడ్డారు. అయితే పండగ సందర్భంగా వచ్చిన ఈ ఓదార్పు ఈ రంగం లో కొంత సానుకూల పరిస్థితి సృష్టించే అవకాశం ఉందన్నారు. నిన జరిగిన జిఎస్ టి కౌన్సిల్ సమావేశంలో రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి అనేక ఎక్కువ 5 శాతం శ్లాబ్ లోకి కొన్నితగ్గితే,మరికొన్ని 28శాతం నుంచి 18 శాతానికి తగ్గాయి. తగ్గింపు ప్రభావాన్ని అంచనా వేసేందుకు సమయం అపుడుతుందని, వెంటనే స్పందించలేమని రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన అనేక మంది చెప్పారు.

ఛార్టర్డ్ అకౌంటెంట్, ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చేంబర్ ఆఫ్ కామర్స్ అండ్ (FTCCI) లో జీఎస్టీ, కస్టమ్స్ కమిటీ చైర్మన్ గా ఉన్న మొహమ్మద్ ఇర్షాద్ అహ్మద్ ఈ రేట్ ల వలన ప్రజలకు బాగానే ఉపశమనం వస్తుందని అభిప్రాయపడ్డారు., అయితే దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గే అవకాశం ఉందని చెప్పారు. “దీనిపైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు జీఎస్టీ కౌన్సిల్ లో కూడా అదే మాట్లాడారు. రాష్ట్రాల ఆదాయాలు 14 శాతం వరకు పెరుగుతాయని కేంద్రం జీఎస్టీ వచ్చాక చెప్పింది కానీ అంత శాతం వాటి ఆదాయం పెరగడం లేదు. ఎన్డీయేతర ప్రతిపక్షాలు ఈ విషయాన్ని కౌన్సిల్ సమావేశం లో ప్రస్తావించాయి. అయితే ఇపుడు శ్లాబుల కుదింపు వల్ల ఆదాయం బాగా తగ్గుతుంది,” అని ఆయన చెప్పారు.

రియల్ రంగం పై సానుకూల ప్రభావం ఉంటుందని ఇర్షాద్ అహ్మద్ చెప్పారు. “ఇటీవల ఎగువ మధ్య తరగతి వారి ఆదాయాలు తగ్గాయి. వ్యాపారాలు వర్కింగ్ క్యాపిటల్ లేక ఇబ్బంది పెడుతున్న పరిస్థితి నెలకొంది. రియల్ ఎస్టేట్ రంగం లో కట్టి అమ్ముడు పోకుండా ఉన్న నిర్మాణాలు పెద్దగా లేవు. లగ్జరీ ఇళ్ల రంగం బాగానే ఉంది. కానీ మధ్యతరగతి కొనే తక్కువ రేటు లోని యిళ్ళ అమ్మకాలు దెబ్బతిన్నాయి. ఈ వర్గాలకు కొంత ఊరట ఉండవచ్చు ,” అని అన్నారు.

క్రెడాయ్ (C Confederation of Real Estate Developers' Associations of India) ప్రెసిడెంట్, కే. ఇంద్రసేన రెడ్డి మాట్లాడుతూ, “మార్బుల్, గ్రానైట్, మట్టి ఇటుకలపై పన్నులు 5 శ్లాబ్ లో పడ్డాయి. దీనితో మొత్తం నిర్మాణ ఖర్చు 3 నుండి 5 శాతం వరకు తగ్గుతుంది. పండుగ సందర్భంగా వచ్చిన ఈ వార్త మార్కెట్ లో పాజిటివ్ సందేశాలు పంపుతుంది. మేము కోరుకున్నట్టు ల్యాండ్ లార్డ్ జీఎస్టీ నీ తగ్గిస్తే మా రంగానికి ఎక్కువ ఉపయోగం ఉండేది. దీనిపైన వేల కేసులు కోర్టుల లో ఉన్నాయి. త్వరలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ని ఈ విషయం లో ఉపశమనం కోసం కోరబోతున్నాము,” అని అన్నారు.

రియల్ ఎస్టేట్ నిపుణులు జాన్సన్ కొయ్యాడ మాట్లాడుతూ ఎనిమిది సంవత్సరాల తరువాత వచ్చిన రేట్ల తగ్గింపు మంచి శకునం అన్నారు. “హైదరాబాద్ లో బిల్డర్ లు ఈ ప్రయోజనాన్ని కొనుగోలు దారులకు ఇస్తారా అనేది చూడాలి. నగరంలో నీ బిల్డర్స్ మధ్యతరగతి కొనగలిగే యిళ్ళ నిర్మాణం చేపట్టడం బాగా తగ్గిపోయింది. నగరం లో నీ బిల్డర్స్ మధ్యతరగతి కొనగలిగే యిళ్ళ నిర్మాణం చెప్పటడం బాగా తగ్గిపోయింది. ఎక్కువ మంది బిల్డర్స్ ధనికుల కోసం మాత్రమే నిర్మాణాలు చేస్తున్నారు. పశ్చిమ హైదరాబాద్ లో ముఖ్యంగా గచ్చిబౌలి, తెల్లపూర్ లాంటి ప్రాంతాల్లో యిదే పరిస్థితి నే మనం చూడచ్చు. ఈ పెద్ద బిల్డర్లు అందరూ కేవలం 2 నుండి 5 శాతం ఉన్న లక్సరీ ఇళ్ళ నిర్మాణానికి మొగ్గు చూపుతూ వచ్చారు. ధనికులు కొనగలిగిన దానికంటే ఎక్కువ ఇళ్ళు అందుబాటులో ఉన్నాయి. కానీ దానికి తగిన డిమాండ్ లేదు, మార్బుల్, గ్రనైట్, సిమెంట్ ధరలు తగ్గినందుకు ఈ వర్గాలకు కొంత ప్రయోజనం కలుగుతుంది. అయితే ముందు మందగమనం లో ఉన్న రియల్ రంగం ఒక నెల ముందు సీఎం గారి హామీలతో కొంత మెరుగుపడింది. ఈ తగ్గింపు మరింత ఊతం ఇస్తుంది. అలాగే ఆర్బిఐ రెపో రేట్ లు తగ్గించటం కూడా ఉపయోగ పండింది. దీనితో వడ్డీ భారం ప్రజలకు తగ్గింది,” అని ఆయన అన్నారు.

యులా (YULA) గ్రూప్ ఛెయిర్మన్ రావూరి కొండయ్య మాట్లాడుతూ మార్కెట్ లో ఉన్న కాంపిటీషన్ వల్ల జిఎస్ టి శ్లాబు రేటు తగ్గింపు వల్ల వచ్చిన ప్రయోజనాన్ని బిల్డర్లు కొనుగోలు దారులకు అందించే అవకాశం ఉంది అని అన్నారు.

“ నిర్మాణ రంగానికి సంబంధించిన నాలుగు శ్లాబుల జిఎస్ టిని రెండు శ్లాబులకు కుదించినందున అడ్మినిష్ట్రేన్ పరంగా కూడా అకౌంట్ ఫైలింగ్ సులభమయింది. నిర్మాణ రంగం మీద ఈ సంస్కరణ వల్ల పెద్దఎత్తున ప్రయోజనం లేకపోయినా సిమెంట్ రంగానికి మాత్రం మంచి పరిణామం. సిమెంట్ కు సంబంధించిన శ్లాబ్ 28 నుంకచి 18 తగ్గడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది,” కొండయ్య చెప్పారు.


Read More
Next Story