మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై రాజుకున్న వివాదం,నాగార్జున ఏమన్నారంటే...
x

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై రాజుకున్న వివాదం,నాగార్జున ఏమన్నారంటే...

సినీ నటీనటులు నాగచైతన్య, సమంతల విడాకులకు కేటీఆర్‌ కారణమని కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై వివాదం రాజుకుంది.మంత్రి వ్యాఖ్యలను అక్కినేని నాగార్జున ఖండించారు.


సినీ నటీనటులు నాగచైతన్య, సమంతల విడాకులకు కేటీఆర్‌ కారణమని తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.కేటీఆర్ వల్ల చాలా మంది హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి వెళ్లిపోయారని మంత్రి సురేఖ ఆరోపించారు.


సినీనటుడు అక్కినేని నాగార్జున ఖండన
తెలంగాణ మంత్రి చేసిన వ్యాఖ్యను అక్కినేని నాగార్జున ఎక్స్ పోస్టులో ఖండించారు. ‘‘గౌరవనీయ మంత్రివర్యులు కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను.రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి.దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవి లో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను.’’అని నాగార్జున ఎక్స్ లో పోస్టు పెట్టారు.

సినిమా వాళ్లంటే చిన్నచూపా? : సినీనటుడు ప్రకాష్ రాజ్

‘‘కేటీఆర్ డ్రగ్స్ తీసుకుని సినిమా నటీమణులకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసి వారి జీవితాలతో ఆడుకున్నారని, వారిని బ్లాక్ మెయిల్ చేశారని, ఇది అందరికీ తెలుసు’’అని తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీనటుడు ప్రకాష్ రాజ్ ఖండించారు. ‘‘ఏంటీ సిగ్గులేని రాజకీయాలు… సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూపా ?’’ అని ప్రకాష్ రాజ్ ఎక్స్ పోస్టులో ప్రశ్నించారు.


Read More
Next Story