వాళ్ళ ఒత్తిడితో రేవంత్ జైలుకు వెళ్లే ప్రమాదం?
x

వాళ్ళ ఒత్తిడితో రేవంత్ జైలుకు వెళ్లే ప్రమాదం?

"సీఎం రేవంత్ రెడ్డి పులి మీద సవారీ చేస్తున్నాడు, మధ్యలో దిగేస్తే.. పులి తినేస్తుంది."


హైడ్రా పనితీరు అభినందనీయం అన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. సీఎం రేవంత్ రెడ్డి పులి మీద సవారీ చేస్తున్నాడు, మధ్యలో ఆపేస్తే.. పులి తినేస్తుంది. హైడ్రా చర్యల వల్ల బడా బాబులైనా జైలుకు వెళ్ళాల్సి వస్తుంది లేదా.. వాళ్ళ ఒత్తిడితో రేవంతైనా జైలుకు వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు నారాయణ. సోమవారం ఆయన హైదరాబాదులోని మగ్ధుమ్ భవన్ లో మీడియాతో మాట్లాడారు. గతంలో ఫిరంగి నాలా కబ్జా అవుతుంటే పాదయాత్ర చేసి.. ఫిర్యాదులు అందించాం, కానీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని వాపోయారు.

ఆదివారం ఎన్ కన్వెన్షన్ ని పరిశీలించాము, అది బఫర్ జోన్ లో.. కాదు FTL లోనే నాగార్జున నిర్మాణం చేశాడని నారాయణ తెలిపారు. కేసిఆర్ ఎన్ కన్వెన్షన్ విషయంలో బుసకొట్టి ఊరుకున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ కన్వెన్షన్ ని కూల్చి చేతులు దులుపుకోకూడదు, నాగార్జున నుంచి డబ్బులు వసూలు చేసి.. చెరువు నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ట్రాఫిక్ నుంచి హైదరాబాద్ బయటపడాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి నారాయణ సూచించారు. MIM చీఫ్ అసదుద్దీన్ ప్రభుత్వ ఆఫీస్ లు కూల్చేస్తారా అంటున్నారు.. దానిమీద రేవంత్ రెడ్డి అఖిల పక్ష సమావేశం పెట్టాలి. ప్రభుత్వ సంస్థలు ప్రజలకు సేవలు అందిస్తున్నాయి.. వాటితో ప్రైవేటు నిర్మాణలు పోల్చడం తప్ప.. సాకుగా చూపే ప్రయత్నమే అని ఎంఐఎం కి కౌంటర్ ఇచ్చారు.

'గవర్నర్ కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఒక బ్రోకర్...'

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆయన జన్మస్థలం జైళ్లను బాగుచేయాలని సీపీఐ నారాయణ అన్నారు. "ప్రధాని గా మోడీ అయ్యాక నేను సన్యాసిని, నాకు అవినీతి చేయాల్సిన అవసరం లేదు అన్నారు. అప్పులు ఎగ్గొట్టిన వాళ్ళలో ఒక్క విజయ్ మాల్య తప్ప మిగితా అందరూ గుజరాత్ వాళ్ళే. మోడీ దయాదాక్షిణ్యాల వల్ల అదానీ పెరిగారు. ఆయన సొంతంగా ఎదగలేదు. సెబి కూడా అదానీ కి దాసోహం అయ్యింది. పదేళ్లలో నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు నిత్యావసర సరుకుల ధరలు పెరుగుదలకు నిరసనగా దేశ వ్యాప్తంగా నిరసనలకు జాతీయ సీపీఐ పిలుపు ఇచ్చింది. కర్ణాటక సీఎం సిద్దరామయ్య మీద గవర్నర్.. విచారణ చేయవచ్చు అని చెప్పారు. గవర్నర్ కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఒక బ్రోకర్. కేంద్రం గవర్నర్ ద్వారా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని దెబ్బకొట్టలని చూస్తున్నారు. ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతిస్తున్నారు. RSS మోడీని మార్చే ప్రయత్నం చేస్తుంది" అని నారాయణ మండిపడ్డారు.

Read More
Next Story