‘పరువు ఉన్నోళ్లు పరువు నష్టం దావా వేయాలి’.. నాగార్జునపై సీపీఐ నారాయణ విసుర్లు
మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు నాగార్జున, మాజీ మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేయడంపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు నాగార్జున, మాజీ మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేయడంపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరువు ఉన్నవాళ్లు పరువు నష్టం దావా వేయాలంటూ నాగార్జునను ఉద్దేవించి విసుర్లు విసిరారు. నారాయణ ఎంట్రీ ఇవ్వడంతో ఇప్పుడిప్పుడే చల్లారుతున్న ఈ వివాదం మళ్ళీ రాజుకుంది. ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న నారాయణ ఒక్కసారిగా ఇప్పుడు ఎందుు స్పందిస్తున్నారన్న చర్చలు కూడా మొదలయ్యాయి. పరువు లేని వ్యక్తి పరువు నష్టం దావా వేయడం హాస్యాస్పదంగా ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు నారాయణ. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పరువు నష్టం దావా వేసే హక్కు, అర్హత ఉన్న వ్యక్తి ఒకే ఒక్కరని అభిప్రాయపడ్డారు. ఆయన మాటలు ప్రస్తుతం కీలకంగా మారాయి. ఇవి మరో వివాదానికి దారితీసేలా ఉన్నాయన్న వాదన కూడా బలంగానే వినిపిస్తున్నాయి.
నాగార్జునకు పరువు ఉందా..
‘‘పరువు లేని వ్యక్తులు క ూడా పరువు నష్టం దావా వేస్తారా? బిగ్ బాస్ షో ద్వారా నాగార్జున తన పరువు పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఆయన వచ్చి మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేయడం విడ్డూరంగా ఉంది. ఈ వివాదంలో కోర్టును ఆశ్రయించే హక్కు, అర్హత సమంతకు మాత్రమే ఉన్నాయి. సమంత ఈ దావా వేసినా ఒక అర్థం పర్థం ఉండేది. బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయిన నాగార్జున దావా వేయడం ఏంటో నాకర్థం కావడంలేదు. తన వ్యాఖ్యాలపై కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. ఆ తర్వాత కూడా కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఏమీ లేదు. అయినా వెళ్లారు. బిగ్ బాస్ షో ద్వారా పాపులరై పరువు పోగొట్టుకున్న నాగార్జున.. మంత్రి వ్యాఖ్యలపై కోర్టును ఆశ్రయించడానికన్నా పెద్ద జోక్ మరేదీ లేదు’’ అంటూ చురకలంటించారు సీపీఐ నారాయణ.
రూ.100 కోట్లకు దావా..
అక్కినేని ఫ్యామిలీపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయ, సినీ వర్గాల్లో సంచలనంగా మారాయి. ఆమె వ్యాఖ్యలపై భగ్గుమన్న అక్కినేని నాగార్జున కోర్టు మెట్లెక్కారు. రూ.100 కోట్లు పరువు నష్టం దావా వేశారు. ఈ పిటిషన్ పై సోమవారం నాంపల్లి మనోరంజన్ కోర్టులో విచారణ జరిగింది. నాగార్జున తరపున సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు. మంగళవారం (రేపు) నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని న్యాయస్థానం తెలిపింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. అయితే, స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కోసం నాగార్జున కోర్టుకి వెళ్లాల్సి ఉంది.
కాగా, ఈ నెల 3న మంత్రి కొండా సురేఖపై హీరో అక్కినేని నాగార్జున రూ.100 కోట్లు పరువు నష్టం దావా వేశారు. సమంత, తన కుటుంబాన్ని ఉద్దేశించి ఆమె చేసిన నిరాధారా వ్యాఖ్యలకు గానూ చర్యలు తీసుకోవాలని నాగార్జున కోర్టును కోరారు. ఆమె తన కుటుంబ పరువును దెబ్బతీసేలా మాట్లాడారాని, అందుకు గానూ తగిన చర్యలు తీసుకోవాలంటూ నాంపల్లి మనోరంజన్ కోర్టును ఆశ్రయించారు. వారి స్వార్థ రాజకీయాల కోసం తమ కుటుంబాన్ని బజారుకీడ్చటం ఏమాత్రం సబబు కాదని నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. మరెవరూ తమ స్వార్థ రాజకీయాల కోసం మరో కుటుంబాన్ని రోడ్డుకీడ్చే ధైర్యం చేయకుండా చర్యలు తీసుకోవాలని నాగార్జున తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఎవర్నీ వదలను: కేటీఆర్
కేటీఆర్ కూడా సురేఖ మీద పరువునష్ట దావా వేశారు. మరి కేటీఆర్ తాజా డిమాండ్ ఏమిటన్నది ఇంకా తేలలేదు. కేటీఆర్ మీద నిరాధార ఆరోపణలు చేసినందుకు మంత్రి క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ నేతలు చాలామంది డిమాండ్లు చేశారు. అయితే కేటీఆర్ మీద చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నట్లు సురేఖ పదేపదే చెప్పారు. దాంతో ఇక లాభంలేదని అనుకుని కేటీఆర్ గురువారం సురేఖ మీద కేసు వేసినట్లున్నారు. ఇదే విషయమై నాలుగురోజుల క్రితం సురేఖ తరపు లాయర్ తిరుపతి వర్మ మీడియాతో మాట్లాడుతు మంత్రి మీద నాగార్జున వేసిన కేసు నిలవదని చెప్పారు. ఎందుకంటే మంత్రికి వ్యతిరేకంగా వేసిన కేసులో నాగార్జున, నాగచైతన్య, సాక్షి సుప్రియ భిన్నమైన స్టేట్మెంట్లు ఇచ్చినట్లు చెప్పారు. ఒకే కేసులో ఇన్ని రకాల స్టేట్‌మెంట్లు ఇచ్చారు కాబట్టే మంత్రి మీద వేసిన కేసు నిలబడదని వర్మ ధీమా వ్యక్తంచేశారు. మరీ నేపథ్యంలో కేటీఆర్ వేసిన కేసు ఏమవుతుందో చూడాలి.