క్రికెటర్ సిరాజ్ కు డిఎస్పీ పోస్ట్
x
Cricketer Md Siraj

క్రికెటర్ సిరాజ్ కు డిఎస్పీ పోస్ట్

క్రికెట్ లో తెలంగాణాకు బాగా గుర్తింపు తీసుకొస్తున్న కారణంగా ఏకంగా డీవైఎస్పీ పోస్టింగ్ ఇస్తున్నట్లు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు.


ప్రముఖ క్రికెట్ ప్లేయర్ మహమ్మద్ సిరాజ్ కు తెలంగాణా ప్రభుత్వం సముచిత రీతిలో గౌరవించింది. క్రికెట్ లో తెలంగాణాకు బాగా గుర్తింపు తీసుకొస్తున్న కారణంగా ఏకంగా డీవైఎస్పీ పోస్టింగ్ ఇస్తున్నట్లు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. టీ20 అంతర్జాతీయ టోర్నమెంట్లో ఇండియా కప్ గెలవటంలో సిరాజ్ కీలక పాత్ర పోషించిన విషయాన్న రేవంత్ గుర్తుచేశారు. క్రీడల ప్రోత్సాహానికి తెలంగాణా ప్రభుత్వం తొందరలో తీసుకురాబోతున్న పాలసీపై సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతు క్రీడల్లో ప్రోత్సాహానికి సంబంధించి దేశంలోనే అత్యుత్తమ పాలసీని అమలుచేస్తున్నది హర్యాన రాష్ట్రమని రేవంత్ చెప్పారు. క్రీడాకారులకు ఏ విధంగా ప్రోత్సాహం అందించాలన్న విషయంలో తమ ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నట్లు చెప్పారు.

క్రీడల్లో నైపుణ్యాలు పెంచుకుని మరింత ఉత్తమ ప్రదర్శన కనబరిచేందుకు, ఆర్ధికంగా ఆదుకునేందుకు, శిక్షణ, ప్రాక్టీస్ తదితర సౌకర్యాలు కల్పించటంలో అత్యుత్తమైన పాలసీని తీసుకొచ్చే విషయంలో ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. క్రీడాకారులను ప్రోత్సహించే విషయంలో విద్యార్హతలకు కూడా మినహాయింపు ఇస్తున్నట్లు గుర్తుచేశారు. సిరాజ్ చదివింది ఇంటర్మీడియెట్టే అయినా గ్రూప్-1 పోస్టు డీఎస్పీగా నియమించాలని మంత్రివర్గంలో డిసైడ్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. గ్రూప్-1 పోస్టుకు దరఖాస్తు చేయాలంటే కనీసం డిగ్రీ చదివి ఉండాలన్న విషయం అందరికీ తెలిసిందే అన్నారు. సిరాజ్ కు అర్హత లేకపోయినా మినహాయింపులు ఇచ్చి మరీ గ్రూప్ 1 పోస్టు డీఎస్పీగా నియమించటంలోనే తమ ప్రభుత్వం చిత్తశుద్ది అర్ధమవుతోందన్నారు.

అలాగే డ్రగ్స్, మధ్యం తదితర వ్యసనాల్లో నుండి యువత బయటపడాలన్నా, వ్యసనాలకు దూరంగా ఉండాలన్నా క్రీడలకు మించిన రంగం లేదన్నారు. క్రీడలపై తనకున్న ఆసక్తి కారణంగానే మంచి పాలసీని తీసుకొచ్చి దేశంలోనే క్రీడల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలన్నది తన ఆలోచనగా చెప్పారు. అందుకనే హర్యానా, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో అమలవుతున్న క్రీడా పాలసీని అధ్యయనం చేయమని అధికారులకు చెప్పినట్లు చెప్పారు. ఎంత అవకాశం ఉంటే అంతగా తమ ప్రభుత్వం క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని రేవంత్ చెప్పారు. క్రీడాకారులు అందుకునే పురస్కరాలకు తగ్గట్లుగా నగదు బహుమతి, ఉద్యోగాలు, ఇంటి స్దలాలు కేటాయించాలన్నది ప్రభుత్వం ఆలోచనగా చెప్పారు.

Read More
Next Story