‘ఓఆర్ఆర్ లీజు గోల్‌మాల్‌లో కేటీఆర్ హస్తం’
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు టోల్ లీజు వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా నడుస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల మధ్య మాటల యుద్ధాలు జరుగుతున్నాయి.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు టోల్ లీజు వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా నడుస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల మధ్య మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బీసీ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ రాచాల యుగంధర్.. ఈ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓఆర్ఆర్ లీజులో రూ.కోట్ల గోల్‌మాల్ జరిగిందని, దాని వెనుక కూడా కేటీఆర్ హస్తం ఉందని ఆయన ఆరోపించారు. ఫార్ములా ఈ-కార్ రేస్ పేరుతో కోట్లు దండుకున్న కేటీఆర్.. ఓఆర్ఆర్ లీజుతో కూడా భారీ అక్రమం చేశారని యుగంధర్ ఆరోపించారు. ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాకు ఓఆర్ార్ టోల్ లీజును ముప్పైఏళ్లకు కట్టబెట్టారని, అందుకుగానూ ఆ తర్వవాత కోట్ల రూపాయలు విలువైన ఎలక్టోరల్ బాండ్లను సదరు సంస్థ కొనుగోలు చేసింనది యుగంధర్ ఆరోపించారు. ఈ లీజ్ ఒప్పందాల పేరిట బీఆర్ఎస్ భారీ గోల్‌మాల్ చేసిందని, భారీ మొత్తంలో నిధులను దారి మళ్లించిందని దుయ్యబట్టారు. క్విడ్ ప్రోకోతో ఎన్‌క్యాష్‌మెంట్ జరిగిందని, ఇందులో ముమ్మాటికీ కేటీఆర్ హస్తం ఉందని అన్నారు.
రెండు నెలల్లోనే ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలు
‘‘27 ఏప్రిల్ 2023లో ఆర్‌డీఇన్‌ఫ్రాకు ఓఆర్ఆర్ టోల్‌ను 30ఏళ్లకు లీజుకు ఇచ్చారు. దానికి ప్రతిఫలంగా సదరు సంస్థ జూలై 4న రూ.25కోట్ల ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. జూలై 13న బీఆర్ఎస్ ఆ డబ్బును ఎన్‌క్యాష్‌మెంట్ చేసుకుంది. జూల్ 16న కూడా వరంగల్ కైటెక్స్ రూ.15కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లు కొన్నిది. సెప్టెంబర్ 12న రంగారెడ్డి జిల్లా కైటెక్స్ 2 యూనిట్ టైమ్‌లో రూ.10 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసింది. బీఆర్ఎస్ పాలనలో ఈ క్విడ్ ప్రోకపై విచారణ జరపాలి. అప్పుడు అన్ని వాస్తవాలు బహిర్గతం అవతాయి. ఎవరు ఏంటి అనేది తేటతెల్లం అవుతుంది. ఈ అంశంపై సీఎం రేవంత్, సీఎస్, ప్రిన్సిపాల్ సెక్రటరీకి ఫిర్యాదు చేశాం. ఏసీబీ, ఈడీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశాం. అప్పటి ఆర్థిక మంత్రి హరీష్ రావుకు కూడా తెలియకుండా, మంత్రివర్గ ఆమోదం, ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే కేటీఆర్ ఇదంతా చేశారు’’ అని యుగంధర్ ఆరోపణలు గుప్పించారు.