సీఎస్‌ పదవికి రాజీనామా చేయనున్న శాంతికుమారి..
x

సీఎస్‌ పదవికి రాజీనామా చేయనున్న శాంతికుమారి..

ఈ నెల 30న సీఎస్ పదవి నుంచి తప్పుకోనున్నారు. పదవీ విరమణ అనంతరం ఆమె మర్రెచెన్నారెడ్డి సంస్థ వైస్ ఛైర్మన్‌‌గా బాధ్యతలను స్వీకరిస్తారు.


తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఆమె మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ(MCRHRDI) వైస్ చైర్‌ఉమన్‌గా నియమితులయ్యారు. అందువల్లే ఈ నెల 30న అంటే బుధవారం సీఎస్ పదవి నుంచి తప్పుకోనున్నారు. పదవీ విరమణ అనంతరం ఆమె మర్రెచెన్నారెడ్డి సంస్థ వైస్ ఛైర్మన్‌‌గా బాధ్యతలను స్వీకరిస్తారు. ఈమెకు ఇదే సంస్థకు డైరెక్టర్‌ జనరల్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి రఘునందన్‌రావు సోమవారం వేర్వేరు ఉత్తర్వులు విడుదల చేశారు.

Read More
Next Story