ఎస్ బీ ఐ ఖాతాదారులు భలే పనిచేశారే
x
Customers locked SBI branch

ఎస్ బీ ఐ ఖాతాదారులు భలే పనిచేశారే

వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని ఎస్బీఐ(SBI) సిబ్బందికి మాత్రం రివర్సు అనుభవం ఎదురైంది.


ఖాతాదారుల ఇళ్ళకు వెళ్ళి ఇచ్చినఅప్పులు వసూలుచేయటంలో బ్యాంకు సిబ్బంది కఠినంగా వ్యవహరించటమే ఇప్పటివరకు అందరికీ తెలిసింది. అయితే వరంగల్(Warangal Dt) జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని ఎస్బీఐ(SBI) సిబ్బందికి మాత్రం రివర్సు అనుభవం ఎదురైంది. బ్యాంకుసిబ్బంది మొత్తాన్ని శుక్రవారం ఖాతాదారులు బయటకు పంపించేసి బ్యాంకుకు తాళం వేసేశారు. ఇంతకీ విషయం ఏమిటంటే ఈ బ్రాంచ్ లో పోయిన ఏడాది నవంబర్ 19వ తేదీన దొంగతనం జరిగింది. 497 మంది ఖాతాదారులకు చెందిన సుమారు 20 కిలోల బంగారు ఆభరణాలను(Gold ornaments theft) దొంగలు ఎత్తుకెళ్ళటం దేశంలోనే సంచలనం సృష్టించింది. బ్యాంకులో సుమారు 20కిలోల బంగారం చోరిఅయిన విషయంవిని అందరు ఆశ్చర్యపోయారు. ముందు నమ్మలేదు కాని తర్వాత జరిగింది నిజమే అని తెలుసుకుని ఆశ్చర్యపోయారు.

ఐరన్ కటర్లు, గ్యాస్ కటర్లను తీసుకొచ్చిన దొంగలు బ్యాంకులో అర్ధరాత్రి పూట ప్రవేశించి లాకర్లను గ్యాస్ కట్టర్లతో కట్ చేసి సేఫుల్లో ఉన్న సుమారు 20కిలోల బంగారునగలను(20 Kgs Gold) దోచుకుని పారిపోయారు. బ్యాంకులో బంగారునగలు దొంగతనం జరిగిన విషయం తెలుసుకున్న ఖాతాదారులందరు అప్రమత్తమయ్యారు. తాము దాచుకున్న నగలు ఏమయ్యాయో కనుక్కుందామని బ్యాంకుకు వెళ్ళారు. బ్యాంకు అధికారులు, సిబ్బంది లెడ్జర్లు, లాకర్ల వివరాలను చూసిన తర్వాత 497 మంది ఖాతాదారులకు చెందిన బంగారునగలు చోరి అయినట్లు బ్యాంకు అధికారులు లెక్కలు తేల్చారు. నగలు పోగొట్టుకున్న 497 మంది ఖాతాదారుల వివరాలను కూడా బ్యాంకు అధికారులు ఫైనల్ చేసి వారందరికీ సమాచారం అందించారు.

అప్పటినుండి బ్యాంకులో తాము దాచుకున్న నగలను వెంటనే ఇవ్వాలని ఖాతాదారులు అధికారులపై గట్టిగా ఒత్తిడి మొదలుపెట్టారు. దాంతో ఖాతాదారుల ఒత్తిడిని తట్టుకోలేక అధికారులు రేపిస్తాము, మాపిస్తామంటు కాలాన్ని నెట్టుకొస్తున్నారు. దాంతో బ్యంకు అధికారుల వైఖరిపై మండిపోయిన ఖాతాదారులు బ్యాంకు ముందు ఆందోళనలు చేయటం మొదలుపెట్టారు. కొంతకాలం తర్వాత ఆందోళనలకు దిగొచ్చిన అధికారులు ఏప్రిల్ 4వ తేదీన ఖాతాదారుల అందరి నగలను తిరిగి ఇచ్చేస్తామని హామీఇచ్చారు. దాంతో దక్కిన హామీ ప్రకారం శుక్రవారం ఖాతాదారులంతా బ్యాంకుకు చేరుకున్నారు. తమకు ఇస్తామని హామీ ఇచ్చిన నగలగురించి అధికారులను అడిగారు. ఖాతాదారులకు సరైన సమాధానం చెప్పని అధికారులు కొంతసేపటి తర్వాత సోమవారం రావాలని చెప్పారు. దాంతో మండిపోయిన ఖాతాదారులు అధికారులతో పెద్ద గొడవకు దిగారు. అధికారులు సరైన సమాధానం చెప్పకపోవటంతో మండిపోయిన ఖాతాదారులు బ్యాంకులో పనిచేసుకుంటున్న సిబ్బంది, అధికారులందరినీ కుర్చీల్లో నుండి బలవంతంగా లేపేశారు. అందరినీ తోసుకుంటు బయటకు తీసుకొచ్చి బ్యాంకుకు తాళంవేసేశారు.

బ్యాంకు దగ్గర జరుగుతున్న గొడవ తెలుసుకున్న పోలీసలు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఖాతాదారులకు నచ్చచెప్పేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా ఉపయోగంలేకపోయింది. పోయిన తమ బంగారునగలను తిరిగి తమకు ఇచ్చేంతవరకు తాము బ్యాంకు ముందునుండి కదిలేదిలేదని ఖాతాదారులందరు బ్యాంకు ముందే కూర్చున్నారు. దాంతో ఏమిచేయాలో అర్ధంకాక బ్యాంకు అధికారులు, సిబ్బంది, పోలీసులు తలలు పట్టుక్కున్నారు.

Read More
Next Story