
తెలంగాణలో రేపు మొంథా తుపాన్ ప్రభావం ఐఎండీ విడుదల చేసిన మ్యాప్
తెలంగాణపై మొంథా తుపాన్ ఎఫెక్ట్ : మూడు రోజులపాటు భారీవర్షాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ముసురుకున్న మొంథా తుపాన్ ప్రభావం తెలంగాణపై కూడా ఉందని ఐఎండీ ప్రకటించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాన్ ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై సోమవారం రాత్రి నుంచి మూడు రోజుల పాటు ఉంటుందని, దీని వల్ల తూర్పు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎ ధర్మరాజు సోమవారం ఉదయం ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
హైదరాబాద్ నగరంలో వెదర్ అలెర్ట్
మొంథా తుపాన్ ప్రభావం వల్ల హైదరాబాద్ నగరంలో అక్టోబరు 28వతేదీన మంగళవారం నుంచి రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ డైరెక్టర్ డాక్టర్ కె నాగరత్న వెల్లడించారు. ఎడతెరిపిలేని వర్షంతోపాటు ఈదురుగాలులు వీస్తాయని ఆమె పేర్కొన్నారు. అతి భారీవర్షాల ప్రభావం వల్ల హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరదనీరు చేరే అవకాశముందని హెచ్చరించారు. ఫ్లాష్ ఫ్లడ్ వచ్చే అవకాశమున్నందున ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు.
నేడు మోస్తరు నుంచి భారీవర్షాలు
మొంథా తుపాన్ ప్రభావం వల్ల సోమవారం తెలంగాణలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెడ్ సైంటిస్ట్ డాక్టర్ కె నాగరత్న వెల్లడించారు. ఆదిలాబాద్, నిర్మల్, కొమురంభీం ఆసిఫాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, హన్మకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, కామారెడ్డి, మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ వివరించింది.
నాలుగు జిల్లాల్లో రెడ్ అలర్ట్
మొంథా తుపాన్ ప్రభావం వల్ల అక్టోబరు 28వతేదీ మంగళవారం తెలంగాణలోని నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎ ధర్మరాజు వెల్లడించారు.జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మంగళవారం అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఆయన తెలిపారు. కొమురంభీం ఆసిఫాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, హన్మకొండ, వరంగల్,ఖమ్మం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని ఆయన తెలిపారు. రేపు తెలంగాణలోని ఏడు జిల్లాల్లో ఆరంజ్ అలెర్ట్ జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు.
రేపు 13 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ
ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట,హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి,నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, జనగామ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ వివరించింది. వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి,మహబూబాబాద్, మెదక్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో తెలిపింది.
తెలంగాణలో ఎల్లుండి కూడా వర్షాలు
మొంథా తుపాన్ ప్రభావం వల్ల ఎల్లుండి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటినుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు చెప్పారు. బుధవారం ఏడు జిల్లాలకు ఆరంజ్ అలెర్ట్ ప్రకటించారు. ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి,జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. ఎల్లుండి నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, హన్మకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశామని హైదరాబాద్ కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎ ధర్మరాజు వివరించారు.
Next Story

