
కేసీఆర్ సభ సక్సెస్ అయ్యేలా ఉంది: దానం నాగేందర్
రాష్ట్రంలో కాంగ్రెస్‌పై వ్యతిరేకత రావడంతో ప్లేట్ ఫిరాయించడానికి దానం ఈ ప్లాన్స్ వేస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
బీఆర్ఎస్ జెండాపై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఫిరాయింపు నేతల్లో దానం నాగేందర్ కూడా ఒకరు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 27న వరంగల్‌లో బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్న రజతోత్సవ సభ గ్రాండ్ సక్సెస్ అవుతుందని తనకు అనిపిస్తుందంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ప్రస్తుతం వివాదాల్లో ఉన్న ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ కూడా ఆయన మద్దతుగా మాట్లాడారు. ఆమె మాటల్లో ఏమీ తప్పులేదన్నారు. ఆయన ఈరోజు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అంతేకాకుండా అసలు దానం ప్లానేంటి అని అనేక మంది విశ్లేషకులు చర్చిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్‌లో ఉప్పుడు కాంగ్రెస్ మద్దతుగా మాట్లాడిన ఈ నేత ఇప్పుడు హస్తం గుర్తు పార్టీలో ఉంటూ బీఆర్ఎస్‌కు సపోర్ట్ చేస్తున్నారు.. వార్తల కేంద్రంగా ఉండటానికే ఆయన ఇలాంటివి చేస్తున్నారా? అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.
‘‘కేసీఆర్ నాయకత్వంలో జరిగే సభకు భారీగా ప్రజలు హాజరవుతారు. కేసీఆర్‌ను చూడటానికి, ఆయన ఏమి మాట్లాడతారు.. అన్న అంశాలపై ప్రజలు ఆసక్తిగా ఉన్నారు. ఆ క్షణం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు’’ అని దానం నాగేందర్ అన్నారు. అనంతరం కంచె గచ్చిబౌలి భూముల వివాదంలో సీనియర్ ఐఏెస్ అధికారి స్మితా సబర్వాల్ చేసిన రీట్వీట్‌ను కూడా దానం సమర్థించారు. అందులో తప్పేమీ లేదని, ఆమె వాస్తవ పరిస్థితినే ప్రజలతో పంచుకున్నారని అన్నారు. అందులో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆమె ఏమీ అనలేదని, ఆమెను విమర్శించడం అనవసరమని అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం అనేక చర్చలు దారితీస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌పై వ్యతిరేకత రావడంతో ప్లేట్ ఫిరాయించడానికి దానం ఈ ప్లాన్స్ వేస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
కాగా కేసీఆర్ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారన్న వ్యాఖ్యలతో దానం నాగేందర్.. కేటీఆర్ లాంటి నేతలకు సెటైర్లు వేశారన్న టాక్ కూడా బలంగా వినిపిస్తోంది. ‘కేసీఆర్‌ను చూడటానికి, ఆయన ఏం మాట్లాడతారో వినడానికి ప్రజలు భారీగా తరలి రానున్నారు’’ అని కేటీఆర్ అన్నారు. ఇప్పుడు అవే మాటలు అని దానం నాగేందర్ దెప్పిపొడుతున్నారంటూ ఆయన అనుచరులు కొందరు అంటున్నారు. కానీ అసలు దానం నాగేందర్ వైఖరి ఏంటి అనేది మాత్రం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.