
హైదరాబాద్ కేంద్రంగా ప్రమాదకర డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు
మెఫిడ్రిన్ డ్రగ్స్ మహారాష్ట్రకు తరలిస్తున్న నిందితులు
చర్లపల్లి డ్రగ్స్ కేసులో దర్యాప్తులో మహారాష్ట్ర పోలీసులు స్పీడ్ పెంచారు. ఇప్పటికే ఈ కేసులో 12 మందిని అరెస్టై కటకటాలపాలయ్యారు. హైదరాబాద్‌లో తయారు చేస్తోన్న మెఫిడ్రిన్ డ్రగ్స్‌ను నిందితులు మహారాష్ట్రకు తరలించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. డ్రగ్స్ కోసం ముంబయి నుంచి ఫైజల్, ముస్తఫా హైదరాబాద్‌కు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ముస్తఫా పాత నేరస్థుడు. ఆయనపై మహారాష్ట్రలో పలు కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ నుంచి మెఫిడ్రిన్ డ్రగ్స్ విక్రయించడానికి ఫైజల్ మధ్యవర్తిగా ఉన్నాడు. అరెస్టు అయిన నిందితులను కస్టడీకి తీసుకుంటే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు చర్లపల్లి వాగ్దేవి ల్యాబొరేటరీ వద్ద పీసీబీ, ఎక్సైజ్, నార్కోటిక్ బ్యూరో అధికారులు ఇప్పటికే తనిఖీలు చేశారు. పూర్తిస్థాయిలో వివరాలు సేకరించిన తర్వాత చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
వాగ్దేవి ల్యాబ్ లో
చర్లపల్లి డ్రగ్ కేసులో విస్తుపోయే నిజాలు వెల్లడౌతున్నాయి. వాగ్దేవి ల్యాబ్ లో3, 500 లీటర్ల రసాయనాలు 950 కిలోల ముడిపదార్థాలు లభ్యమయ్యాయి. 12వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ను థానే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ దందా జరగడంతో దర్యాప్తు అధికారులు కేసును సీరియస్ గా తీసుకున్నారు. హైదరాబాద్ లో తయారయ్యే ఈ డ్రగ్స్ విదేశాలకు ఎగుమతైనట్లు తెలుస్తోంది. ఎండి డ్రగ్స్ కంపెనీని పోలీసులు సీజ్ చేశారు. మూడు రకాల డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదకర ఎక్స్ టీసీ,మోలీ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.