9కి చేరిన కల్తీకల్లు మృతుల సంఖ్య
x

9కి చేరిన కల్తీకల్లు మృతుల సంఖ్య

సీరియస్ గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం


హైదరాబాద్ కూకట్ పల్లిలో కల్తీ కల్లు తాగి శుక్రవారం మధ్యాహ్నం వరకు మొత్తం 9 మంది చనిపోయారు. నిన్నటిరకు 8 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా మరో వ్యక్తి చనిపోవటంతో ఈ కేసు తీవ్రత మరింత పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సీరియస్ గా పరిగిణించి కూకట్ పల్లి పోలీసులను దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించింది. కల్తీ కల్లు తాగి మొత్తం 51 మంది అస్వస్థతకు గురయ్యారు. గాంధీ ఆస్పత్రిలో 14 మందికి చికిత్స కొనసాగుతుంది. నిమ్స్ ఆస్పత్రిలో మరో 34 మందికి చికిత్స కొనసాగుతుంది. నిమ్స్ లో ఆరుగురికి డయాలసిస్ జరుగుతోంది. ఈఎస్ ఐ లో ఒకరు, ప్రయివేటు ఆసుపత్రిలో మరొకరికి చికిత్స కొనసాగుతుంది.

కాగా తాజాగా శుక్రవారం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 70 ఏళ్ల గంగారాం చనిపోయారు.

దీంతో చనిపోయిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది.

Read More
Next Story