కేసీయార్ కు రివర్సయిన ఫిరాయింపు ఎంఎల్ఏ
x
Dr Sanjay kumar

కేసీయార్ కు రివర్సయిన ఫిరాయింపు ఎంఎల్ఏ

నియోజకవర్గం డెవలప్మెంట్ కోసమే తాను కాంగ్రెస్ లోకి మారినట్లు సమర్ధించుకున్నారు.


బీఆర్ఎస్ లో నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎంఎల్ఏ డాక్టర్ సంజీవ్ కుమార్ రివర్సులో కేసీయార్ కు సమాధానమిచ్చారు. సంజయ్ 2023 ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ తరపున పోటీచేసి గెలిచారు. ఈమధ్యనే కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. నియోజకవర్గం డెవలప్మెంట్ కోసమే తాను కాంగ్రెస్ లోకి మారినట్లు సమర్ధించుకున్నారు.

డాక్టర్ ఎంఎల్ఏ మాట్లాడుతు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు చాలామంది కాంగ్రెస్ ఎంఎల్ఏలు కారుపార్టీలోకి ఫిరాయించిన విషయాన్ని గుర్తుచేశారు. అప్పట్లో పార్టీ ఫిరాయించిన ఎంఎల్ఏలు తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసమే పార్టీ మారిన విషయాన్ని సంజీవ్ గుర్తుచేశారు. కాంగ్రెస్ లో నుండి బీఆర్ఎస్ లోకి ఫిరాయించిన ఎంఎల్ఏలంతా తమ నియోజకవర్గాలను బాగా డెవలప్ చేసుకున్నట్లు చెప్పారు. అదే పద్దతిలో ఇపుడు తాను కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్ లోకి మారినట్లు స్పష్టంచేశారు. అప్పట్లో కాంగ్రెస్ లో నుండి బీఆర్ఎస్ లోకి ఎంఎల్ఏలు మారటం సబబే అయితే ఇపుడు తాను బీఆర్ఎస్ లో నుండి కాంగ్రెస్ లోకి మారటం కూడా సబబే కదా అని గట్టి ఫిట్టింగ్ రిప్లై ఇచ్చారు.

ఎవరు ఏ పార్టీలో నుండి పార్టీలోకి మారినా అంతిమంగా నియోజకవర్గం అభివృద్ధే ధ్యేయమైనపుడు పార్టీ మారటం తప్పెలాగ అవుతుందని సూటిగా ప్రశ్నించారు. కాబట్టి ఎంఎల్ఏల ఫిరాయింపులపై కోర్టులో కేసు వేయటం కాకుండా కేసీయార్ ముందు సంజయ్ ప్రశ్నకు సమాధానం చెబితే బాగుంటుంది. వాస్తవాలు మాట్లాడుకోవాలంటే ప్రత్యేక తెలంగాణా ఏర్పడిన తర్వాత ఫిరాయింపులకు తెరలేపిందే కేసీయార్. అవసరానికి ఫిరాయింపులకు పాల్పడిన కేసీయార్ ఆ తర్వాత అవసరం లేకపోయినా యధేచ్చగా ఫిరాయింపులను ప్రోత్సహించారు. ఇతర పార్టీల నుండి నలుగురు ఎంపీలు, 25 మంది ఎంఎల్ఏలు, 18 మంది ఎంఎల్సీలను కారుపార్టీలోకి చేర్చుకున్నారంటేనే కేసీయార్ ఏ స్ధాయిలో ఫిరాయింపులకు పాల్పడ్డారో అర్ధమైపోతోంది. ఫిరాయింపులను ప్రోత్సహించిన కేసీయార్ తన చర్యలను సమర్ధించుకున్నారు. రాజకీయ పునరేకీకరణలో భాగంగానే ఎంఎల్ఏలు, ఎంపీలు, ఎంఎల్సీలు తమ పార్టీలో చేరుతున్నట్లు సమర్ధించుకున్నారు. మరిపుడు కూడా రాజకీయ పునరేకీకరణలో భాగంగానే బీఆర్ఎస్ ఎంఎల్ఏలు కాంగ్రెస్ లో చేరుతున్నట్లు రేవంత్ చెబుతున్నారు.

తాను అధికారంలో ఉన్నపుడు చేసిన పనినే ఇపుడు రేవంత్ చేస్తుంటే కేసీయార్ తప్పుపట్టడమే కాకుండా తట్టుకోలేకపోతున్నారు. ఇదే పాయింట్ ను సంజయ్ ప్రస్తావించారు. మొత్తంమీద కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎంఎల్ఏలందరు నియోజకవర్గాల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ లో చేరుతున్నట్లు చెబితే కేసీయార్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. అందుకనే సంజయ్ కాంగ్రెస్ లో చేరికపై గట్టిగా సమర్ధించున్నారని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారు.

Read More
Next Story