ఢిల్లీ లిక్కర్ కేసు లో కవిత కథ, రెండో భాగం మొదలు
ఢిల్లీ లిక్కర్ కేసు తెలంగాణ చాప్టర్ రెండో భాగం మొదలుయింది. ఈ సారి కవిత్ రోల్ థిక్ గానే ఉండేసూచనలు కనిపిస్తున్నాయి.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసు లోక్ సభ ఎన్నికల ముందు కొత్తమలుపు తిరుగుతూ ఉంది.
ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కూతురు, బిఆర్ ఎస్ ఎమ్మెల్సీ అయిన కల్వకుంట్ల కవిత ని సీబీఐ ఛార్జిషీటులో నిందితురాలిగా పేర్కొంది. ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఇప్పటివరకు ఆమెను నిందితురాలిగా చేర్చలేదు. గతంలో కవితను సీబీఐ ప్రశ్నించింది తప్ప చార్జ్ షీట్ లోపేర్కొన్న లేదు.
తర్వాత సిబిఐ ఈ విషయమే మర్చిపోయింది. ఆతర్వాత ఎన్ ఫోర్స్ మెంటు డైరెక్టొరేట్ (ఇడి)హవాలా యాంగిల్ లోనుంచి కవితని విచారించి నానా హంగామా చేసింది. అరెస్టు తప్పదన్నంత వరక్ తీసుకెళ్లింది. అంతే, ఆ తర్వాత ఏమి జరిగిందో ఏమో ఇడి కూడా కవితను మర్చిపోయింది. దీనికి కారణం కోర్టు కేసులని కొందరు చెబుతారు, మరికొందరు రాజకీయ ఒప్పందంలో భాగమని అంటారు.
ఒక మహిళను ఇడి కార్యాలయానికి విచారణకు పిలవరాదని, సిఆర్ పిసి చట్టం ప్రకారం ఆమెను ఇంటిదగ్గిరే విచారించాలని కవిత సుప్రీంకోర్టు లో పిటిషన్ వేసింది. దీని మీద ఆమెను అరెస్టు చేయకుండా, సమన్లు కూడా జారీ చేయకుండా కోర్టు రక్షణ కల్పించింది. ఫిబ్రవరి 16కు ఈ రక్షణ ముగిసింది. ఏమయినా కెసిఆర్ ఢిల్లీ లో చక్రం తిప్పి ఏదో చేశారని అందుకే ఆమెజోలికి ఏ దర్యాప్తు సంస్థ రాలేదనుకున్నారు. ఇక లిక్కర్ కేసు కథ కంచికి చేరిందని అంతా అనుకున్నారు.
ఇపుడు మళీ సిబిఐ కథ రెండో భాగం మొదలుపెట్టింది. ఈ సారి ఎంతవరకు పోతుందో తెలియదు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది సుమారు వెేయి కోట్ల వ్యవహారం. ఆందులో హైదరాబాద్, ఆంధ్ర కు చెందిన పలువురు లిక్కర్ వ్యాపారుల పాత్ర ఉందని చెబుతారు. దీనికి సౌత్ గ్రూప్ అని పేరొచ్చింది. ఈ సౌత్ గ్రూప్ లో కీలకమయిన వ్యక్తి కల్వకుంట్ల కవిత అని చెబతారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం తెలంగాణ చాప్టర్ రెండో భాగం రాజకీయ పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.