గాంధీభవన్ కి ఢిల్లీ పోలీసులు..
x

గాంధీభవన్ కి ఢిల్లీ పోలీసులు..

మరోసారి ఢిల్లీ పోలీసులు తెలంగాణకి చేరుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో మరో నలుగురికి నోటీసులు ఇవ్వనున్నటు తెలుస్తోంది.


మరోసారి ఢిల్లీ పోలీసులు తెలంగాణకి చేరుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో మరో నలుగురికి నోటీసులు ఇవ్వనున్నటు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నేడు గాంధీ భవన్ కి వచ్చిన ఢిల్లీ పోలీసులు.. లీగల్ సెల్ రామచంద్రారెడ్డి కోసం ఆరా తీశారు. పీసీసీ లీగల్ సెల్ నాయకులు అందుబాటులో లేకపోవడంతో మళ్ళీ వస్తామని తిరిగి వెళ్లిపోయారు.

ఇప్పటికే అమిత్ షా ఫేక్ వీడియో కేసులో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరో ముగ్గురికి ఢిల్లీ పోలీసులు సోమవారం నోటీసులు ఇచ్చారు. బుధవారం విచారణకి హాజరవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే రేవంత్ స్టార్ క్యాంపెయినర్ గా ఉండడంతో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన తరపున టీపీసీసీ లీగల్ సెల్ లాయర్ సౌమ్య గుప్తా ఢిల్లీ పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఫేక్ వీడియో పోస్ట్ అయిన సోషల్ మీడియా అకౌంట్స్ తో సీఎం రేవంత్ కి ఎలాంటి సంబంధం లేదని ఆమె విచారణ అధికారులకు వివరించారు. అలాగే సీఎం విచారణకి హాజరు కాలేరని, మరో నాలుగు వారాలపాటుగడువు కోరారు.

కాగా, అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసు దర్యాప్తులో భాగంగా ఢిల్లీ పోలీసులు నాలుగు రోజులుగా హైదరాబాద్ లోనే మకాం వేశారు. కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్ ఇళ్లపై నిఘా ఉంచినట్లు సమాచారం. ఈ క్రమంలోనే బుధవారం గీత అనే సోషల్ మీడియా వారియర్ ఫోన్ ని ఢిల్లీ పోలీసులు సీజ్ చేశారు.

ఐదుగురు వారియర్స్ అరెస్ట్

ఇక ఈ కేసులో ఐదుగురు కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్ ని గురువారం హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అమిత్ షాపై ఫేక్ వీడియో చేశారని బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంఛార్జ్ మన్నే సతీష్‌తో పాటు విష్ణు, వంశీ, నవీన్, గీత, ఆస్మా తస్లీమ్, శివలను హైదరాబాద్ పోలీసులు నేడు అదుపులోకి తీసుకున్నారు.

Read More
Next Story