హైడ్రాకు అభినందనలు
x

హైడ్రాకు అభినందనలు

ఫలించిన టెలికం కో ఆపరేటివ్ సభ్యుల పోరాటం


రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోనాదర్ గుల్ లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు బుల్ డోజర్ల సాయంతో కూల్చివేశారు. 1986లో టెలికం కో ఆపరేటివ్ హౌజింగ్ సొసైటీ వంద ఎకరాల భూమిలో ప్లాట్లను నిర్మించి తమ సభ్యులకు పంపిణీ చేసింది.

2016లో అక్రమార్కులు ధరణి పోర్టల్ ద్వారా అక్రమ పాస్ బుక్కులను సంపాదించి సొసైటీ భూమిలో నూతన వెంచర్ ఏర్పాటు చేశారు. 23 అక్రమ కట్టడాలు నిర్మించి అన్ని అనుమతులు తెచ్చుకున్నారు. అసలైన ప్లాట్ యజమానులు కలెక్టర్, మున్సిపల్ అధికారులకు దృష్టికి తీసుకువచ్చారు. అయినా చర్యలు తీసుకోకపోవడంతో అసలైన ప్లాట్ యజమానులు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను కలిసి ఫిర్యాదు చేశారు.

సమగ్ర విచారణ జరిపిన హైడ్రా అధికారులు అక్రమంగా మంజూరైన పర్మిషన్లను రద్దు చేశారు. బుధవారం అక్రమ కట్టడాలను కూల్చేసిన హైడ్రా అసలైన ప్లాట్ యజమానులకు ప్లాట్లను తిరిగి ఇచ్చివేశారు. ఈ సందర్బంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ప్లాట్ యజమానులు అభినందనలు తెలిపారు.

Read More
Next Story