
వావివరసలు మరిచిన పెదనాన్న
మనస్థాపానికి గురైన బాలిక ఆత్మహత్య
వావి వరసలు లేని ఓ కామాంధుడి వికృత చేష్టలకు ఓ బాలిక బలైంది. స్వంత తమ్ముడి కూతురిపై లైంగిక వేధింపులు తట్టుకోలేక 17 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. కుత్బుల్లాపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పేట్ బషీర్ బాద్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇంటిర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్న పింకీ తండ్రి కొద్ది రోజుల క్రితం చనిపోయాడు. పింకి తండ్రి చేసిన అప్పులు వసూలు చేయడానికి పెదనాన్న అయిన నిందితుడు తరచూ పింకీ ఇంటికి వచ్చేవాడు. అసభ్యంగా ప్రవర్తించేవాడు. తనతో అసభ్యంగా ప్రవర్తించడంతో పింకీ తీవ్ర మనస్థాపానికి గురైంది. చనిపోయే ముందు పింకి సుసైడ్ నోట్ రాసింది. పెదనాన్న వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సుసైడ్ నోట్ లో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story