
భాగ్యలక్ష్మి ఆలయానికి పోటెత్తిన భక్తులు
దీపావళికి రోజు దర్శనం చేసుకోవడం సెంటిమెంట్
దీపావళి పర్వ దినం పురస్కరించుకుని సోమవారం చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయానికి భక్తుల తాకిడి పెరుగుతోంది. సాయంత్రం వరకు భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. దీపావళి రోజు అమ్మవారిని దర్శించుకోవడం సెంటిమెంట్ గా వస్తోంది. తమ జీవితాల్లో వెలుగులు నింపాలని మొక్కులు సమర్పించుకుంటున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, బిజెపి రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ తదితరులు దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు.
Next Story