యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు
x

యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు

దసరా సెలవులు ముగియడంతో పెరిగిన రద్దీ


యాదగిరిగుట్టకు భక్తులు పోటెత్తారు. దసరా సెలవులు ఆదివారంతో ముగియనుండటంతో తెలుగు రాష్టాలకు చెందిన భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడంతో ధర్మదర్శనానికి మూడుగంటల సమయం పడుతుంది. విఐపి దర్శనానికి గంట సమయం పడుతుంది. దసరా సందర్బంగా సొంతూళ్లకు వెళ్లిన భక్తులు తిరుగు ప్రయాణంలో యాదగిరిగుట్ట లక్ష్మీ నారసింహాస్వామిని దర్శించుకుంటున్నారు. ఉదయం నుంచి రద్దీ పెరగడంతో భక్తులతో కిట కిటలాడుతోంది.

లక్ష్మీనారసింహుని దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో క్యూలైన్లు క్రిక్కిరిసిపోయాయి. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నిన్న(శనివారం) 40 వేల మంది భక్తులు నరసింహాస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నట్లు ఆలయ అధికారులు చెప్పారు. వివిధ పూజలతో రూ 41, 31,970 ఆదాయం వచ్చినట్లు వారు చెప్పారు.

తెలంగాణలో ప్రసిద్ద పుణ్య క్షేత్రం

తెలంగాణలో ప్రసిద్ది చెందిన పుణ్య క్షేత్రాల్లో యాదగిరిగుట్ట ఒకటి. ఇది భువనగిరి జిల్లా మండల కేంద్రంలో ఉంది. హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్లే దారిలో ఉంది.

యాద మహర్షి ఇక్కడ తపస్సు చేసినట్లు పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. ఆ నారసింహుని దర్శన భాగ్యం పొందిన మహర్షి కోరిక ప్రకారమే కొండ యాదగిరి అని పిలవబడింది. యాదగిరి గుట్ట లక్ష్మి నారసింహాస్వామి అనివాడుకలో వచ్చింది. కెసీఆర్ ప్రభుత్వం దీని పేరును యాదాద్రిగా మార్చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే పాత పేరునే కొనసాగిస్తున్నారు. ప్రముఖులు కొందరు ఆలయాన్ని దర్శించుకున్నారు. వీరిలో నూతన డిజిపి ఉన్నారు. తెలంగాణ నూతన డిజిపిగా పదవీ బాధ్యతలు చేపట్టిన శివధర్ రెడ్డి ఆదివారం కుటుంబ సమేతంగా ఆలయాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

Read More
Next Story